News


నష్టాల్లోకి బ్యాంకింగ్‌ రంగ షేర్లు

Thursday 5th December 2019
Markets_main1575529758.png-30073

ఆర్‌బీఐ నిర్ణయం మార్కెట్‌ అంచనాలను ప్రతికూలంగా ఉండంటంతో సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లింది. ఆర్‌బీఐ నేడు కీలకమైన పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈసారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రేటు 4.90 వద్ద, బ్యాంక్‌ రేటు 5.40శాతం వద్ద కొనసాగుంది. అర్‌బీఐ అనూహ్య పరిణామంతో వడ్డీరేట్లపై ప్రత్యక్ష సంబంధం ఉన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాలు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు ఒకశాతం వరకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,979.30)తో పోలిస్తే 0.65శాతం లాభంతో 31,774.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌, పీఎన్‌బీ, యస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం నష‍్టపోయాయి. కోటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 0.35శాతం క్షీణించాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడింది.  ప్రభుత్వరంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.21శాతం క్షీణించగా, ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయింది. 



You may be interested

రేట్లు ఎందుకు తగ్గించలేదంటే...?

Thursday 5th December 2019

ఆహార ధరల పెరుగుదలపై ఆందోళనలే వడ్డీరేట్ల తగ్గింపునకు అడ్డం పడ్డాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వివరించారు. ఆహార ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగిందని, దీంతో రేట్ల తగ్గింపు యోచన విరమించామని తెలిపారు. రాబోయే త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవలి గణాంకాలు సూచించాయన్నారు. అయితే కోర్‌ ద్రవ్యోల్బణం మాత్రం తమ టార్గెట్‌ 4 శాతం లోపే ఉండొచ్చన్నారు. ఆహార పదార్ధాల ధరలు తగ్గడం అనేక అంశాలపై

వడ్డీరేట్లు యథాతధం

Thursday 5th December 2019

మానిటరీ పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. వరుసగా ఆరోమారు కూడా ఆర్‌బీఐ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేట్లను యథాతధంగా ఉంచింది. దీంతో రెపో 5.15 శాతం, రివర్స్‌ రెపో 4.90 శాతం వద్ద కొనసాగనున్నాయి. కమిటీలోని అందరు సభ్యులు ఏకగ్రీవంగా రేట్లు యథావిధిగా ఉంచేందుకు అంగీకరించారు. దీంతో పాటు వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ

Most from this category