News


‘‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’’తో ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 20th December 2019
Markets_main1576836505.png-30337

ఇకపై నిరంతరంగా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు చేపడతామన్న ఆర్‌బీఐ ప్రకటనతో బాండ్‌ ఈల్డ్స్‌ దిగివచ్చాయి. దీంతో బ్యాంకు షేర్లు ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు శుక్రవారం మంచి ర్యాలీ జరిపాయి. ఆర్‌బీఐ ప్రకటనతో 10ఏళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ 14 బీపీఎస్‌ తగ్గి 6.61 శాతానికి వచ్చింది. దీంతో నిఫ్టీ పీఎస్‌బీ సూచీలోని షేర్లన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ తదితరాలన్నీ 2-3 శాతం ర్యాలీ జరిపాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ 2.12 శాతం లాభపడింది. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీ సైతం లాభాలను చూసింది. ప్రైవేట్‌ బ్యాంకుల్లో యస్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితరాలు దాదాపు 2 శాతం వరకు లాభపడ్డాయి. త్రైమాసికం చివర్లో ఈల్డ్స్‌ దిగిరావడం బ్యాంకులకు ఉత్సాహాన్నిచ్చిందని మార్కెట్‌ అనలిస్టు సిద్ధార్ధ పురోహిత్‌ చెప్పారు. త్రైమాసికం చివర్లో ఈల్డ్స్‌ ఎక్కువగా ఉంటే ట్రెజరీ పోర్టుఫోలియో నష్టాల్లో ఉండేదని, ఇప్పుడీ పరిస్థితి మారిందని వివరించారు. ఆర్‌బీఐ ప్రకటనతో క్రమంగా లిక్విడిటీ పెరుగుతుందని అంచనా వేశారు. 
ఆపరేషన్‌ ట్విస్ట్‌ అంటే...
జెరోమ్‌ పావెల్‌ నేతృత్వంలో యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు కనిపెట్టిన మానిటరీ పాలసీ విధానానికి ఆపరేషన్‌ ట్విస్ట్‌ అని పేరు. ఈ విధానం అమెరికా వడ్డీరేట్లపై ప్రభావం చూపింది. ఇందులో స్వల్పకాలిక బాండ్లను అమ్మడం, దీర్ఘకాలిక బాండ్లను కొనడం చేస్తారు. దీంతో దీర్ఘకాలిక ఈల్డ్స్‌ దిగివచ్చి లిక్విడిటీ మరింత పెరుగుతుంది. తర్వాత కాలంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఈ విధానం అవలంబిస్తున్నాయి. తాజాగా ఆర్‌బీఐ సైతం ఇదే విధానం అవలంబిస్తామని తెలిపింది. రూ.10వేల కోట్ల విలువైన పదేళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్లను కొంటామని, ఇదే సమయంలో అంతే మొత్తానికి ఏడాది కాలపరిమితి కలిగిన బాండ్స్‌ను విక్రయిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. బాండ్లను కొనుగోలు చేయడంతో వాటి ధర పెరిగి ఈల్డ్స్‌ దిగివస్తాయి. బ్యాంకులు వడ్డీరేట్ల నిర్ణయానికి లెక్కించే పారామీటర్లలో పదేళ్ల ఈల్డ్స్‌ కూడా ఒకటి. ఇవి దిగివస్తే ఆటోమేటిగ్గా బ్యాంకుల రేట్లు కూడా తగ్గుతాయి. తద్వారా వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది. 



You may be interested

స్వల్ప లాభాల ముగింపు

Friday 20th December 2019

నాలుగో రోజూ కొనసాగిన రికార్డుల ర్యాలీ సూచీలను నడిపించిన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 7.62 పాయింట్లు పెరిగి 41,681.54 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12.10 పాయింట్ల లాభంతో 12,271.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 143 పాయింట్లు పెరిగి

2020 టాప్‌ రికమండేషన్లు

Friday 20th December 2019

కొత్త ఏడాది కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు పలు రంగాలు, షేర్లను రికమండ్‌ చేస్తున్నాయి. 1. క్రెడిట్‌ సూసీ: ఫైనాన్షియల్స్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌. టెల్కోల్లో ఎయిర్‌టెల్‌, యుటిలిటీల్లో పవర్‌గ్రిడ్‌, మెటల్స్‌లో టాటా మెటల్స్‌పై బుల్లిష్‌. ఫార్మా, ఐటీ రంగాలపై స్వల్ప పాజిటివ్‌. 2. బీఎన్‌పీ పారిబా: ప్రైవేట్‌ బ్యాంక్స్‌, బీమా కంపెనీలు, టాప్‌ ఐటీ కంపెనీలను పరిశీలించవచ్చు. వాల్యూషన్లు తక్కువగా ఉండి రీబౌన్స్‌ చూసే స్టాకులను ఎంచుకోవచ్చు. 3. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌:

Most from this category