లాభాల ముగింపు
By Sakshi

జాతీయ, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్ బుధవారం లాభంతో ముగిసింది. ముఖ్యంగా మిడ్‌సెషన్ అనంతరం జరిగిన కొనుగోళ్లతో సెనెక్స్ 162 పాయింట్లు పెరిగి 36,724 వద్ద, నిఫ్టీ 46.75 పాయింట్ల లాభంతో 10,844.65 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 9నెలల కనిష్టం నుంచి రికవరి, నిన్న సూచీల భారీ పతనం నేపథ్యంలో వ్యాల్యూ షేర్లకు కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడటంతో అవి పెరిగాయి. హాంకాంగ్‌లో కొద్దిరోజులుగా చెలరేగుతున్న ఆందోళనకు కారణమైన బిల్లును ఆ దేశ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో హాంగ్‌సెంగ్ ఇండెక్స్ ఒక్కరోజులోనే 1000 పాయింట్లు లాభపడింది. అలాగే మందగమనం భయాలున్నప్పటికీ., ఆగస్ట్‌లో చైనా తయారీ రంగం పనితీరు నెలల గరిష్టానికి చేరుకోవడంతో ఆసియా మార్కెట్ 5వారాల గరిష్టం వద్ద ముగియడంతో పాటు ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ అరశాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. అలాగే బ్రిటన్, ఇటలీ దేశాల్లో రాజకీయ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడంతో యూరప్ మార్కెట్లు 1శాతం లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్, మెటల్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మీడియా, రియల్టీ రంగ షేర్లకు అమ్మకాల మద్దతు లభించింది. బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 300 పాయింట్లు పెరిగి 27,123.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే నిఫ్టీ ఇండెక్స్ 10,746.35 - 10,858.75 శ్రేణిలో, సెన్సెక్స్ సూచీ 36,409.54-36,776.31 స్థాయిలో కదలాడాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐఓసీ, బీపీసీఎల్, టాటాస్టీల్ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. ఏషియన్ పేయింట్స్, టాటామోటర్స్, బ్రిటానియా, సన్‌ఫార్మా, మారుతి షేర్లు 2.50శాతం నుంచి 4శాతం వరకు నష్టపోయాయి.
You may be interested
ఇండియా వెయిట్‌ను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ
Wednesday 4th September 2019దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో మోర్గాన్ స్టాన్లీ ఆసియా బ్యాంకుల పోర్టుపోలియోలో ఇండియా వెయిట్‌ను 8 పాయింట్ల తగ్గించినట్టు మోర్గాన్ స్టాన్లీ ఓ నివేదికలో పేర్కొంది. గతంలో ఈ పోర్టుపోలియోలో ఇండియా వెయిట్ 25 శాతం ఉండగా తాజా కోతతో అది 17.5 శాతానికి పడిపోయింది. ఇండియాకు చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు మోర్గాన్ స్టాన్లీ ఆసియా బ్యాంక్స్ పోర్టుపోలియోలో ఉండగా, దీని నుంచి
ఇదొక ‘విలువల ఉచ్చు’..యాంకర్ బ్యాంకులకు దూరం!
Wednesday 4th September 2019-సురేష్ గణపతి, మాక్వేరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలో వున్న యాంకర్బ్యాంకులకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలని మాక్వేరీ క్యాపిటల్ సెక్యురిటీస్ విశ్లేషకుడు సురేష్ గణపతి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో సూచించారు. ఈ బ్యాంకులకు విలువను పెంచే సామర్ధ్యం లేదని, ఇవి ఇన్వెస్టర్లకు ఎటువంటి అవకాశాలను అందించలేవని వివరించారు. ‘చౌకగా ఉన్నాయని ఎవరైనా ఈ బ్యాంకుల షేర్లను కొనుగోలు చేస్తే వాళ్లు ఉచ్చులో చిక్కుకున్నట్టే’ అని