News


కుప్పకూలిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 30th September 2019
Markets_main1569818031.png-28618

  • 654 పాయింట్లు నష్టపోయిన ఇండెక్స్‌

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే 2శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 29,674.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌ 2.20శాతం(654 పాయింట్లు) నష్టపోయి 29222.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(29222.70)తో పోలిస్తే 2శాతం నష్టంతో 29,277.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌బ్యాంక్‌ 9శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌ 7శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 5.50శాతం నష్టపోయింఆయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.50శాతం, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. పీఎన్‌బీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనయ్యాయి.  



You may be interested

పతనం తర్వాత కోలుకుంటున్న చమురు

Monday 30th September 2019

గత సెషన్‌లో రెండువారాల కనిష్ఠానికి పడిపోయిన చమురు ధరలు తిరిగి సోమవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయినప్పటికి అంతర్జాతీయ పరిణామాల వలన చమురు లాభాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 9.51 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.18 శాతం లాభపడి బారెల్‌ 61.15 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.14 శాతం లాభపడి 55.99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా బ్రెంట్‌ క్రూడ్‌ శుక్రవారం సెషన్లో 1.3 శాతం

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 30th September 2019

ఏషియన్‌ పెయింట్స్‌     కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.1,776 టార్గెట్‌ ధర: రూ.1,950 ఎందుకంటే:- కార్పొరేట్‌ ట్యాక్స్‌ను  33 శాతం నుంచి 25.2 శాతానికి కేంద్రం తగ్గించడం ఈ కంపెనీకి బాగా ప్రయోజనం చేకూర్చే అంశమే. ఈ పన్ను కోత కారణంగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చెరో 12 శాతం చొప్పున పెరగనున్నది. డెకరేటివ్‌ పెయిం‍ట్స్‌ సెగ్మెంట్లో ముఖ్యంగా ప్రీమియమ్‌

Most from this category