News


లాభాల్లో బ్యాంక్‌ ఇండెక్స్‌..నెగిటివ్‌లో కోటక్‌

Tuesday 27th August 2019
Markets_main1566883649.png-28044

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్ధీపన చర్యలతో పాటు, ఆర్‌బీఐ తన మిగులు నిధులను ప్రభుత్వానికి అందించడానికి ఆమోదముద్ర వేయడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.43 సమయానికి 260.40 పాయింట్లు లాభపడి 28217.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.32 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.50 శాతం లాభపడి ట్రేడవుతుండగా, కోటక్‌ బ్యాంక్‌ మాత్రం 0.54 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.84 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 3.42 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 1.93 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ప్రవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లయిన యస్‌ బ్యాంక్‌  3.50 శాతం ,  ఫెడరల్‌ బ్యాంక్‌ 1.08 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.01 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 1.01 శాతం,  యాక్సిస్‌ బ్యాంక్‌ 0.94 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 0.92 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. 



You may be interested

ముగిసిన ఇన్ఫోసిస్‌ ‘బై బ్యాక్‌’

Tuesday 27th August 2019

ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన రూ. 8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్ ద్వారా 11.05 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేశామని దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సోమవారం పేర్కొంది. అగష్టు 26 వరకు, 11,05,19,266 ఈక్విటీ షేర్లను, షేరు రూ. 747.38 చొప్పున బై బ్యాక్‌ చేశామని, రూ. 82,59,99,99,430.03 నగదును ఉపయోగించి గరిష్ఠంగా 99.999999 శాతం షేర్లను తిరిగి కొనుగోలు చేయగలిగామని కంపెనీ తెలిపింది.

ఈ కౌంటర్లలో ర్యాలీ సంకేతాలు!

Tuesday 27th August 2019

దాదాపు వంద లార్జ్‌ మరియు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ చార్టుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు

Most from this category