News


ఏడాది కనిష్టానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు

Tuesday 30th July 2019
Markets_main1564481244.png-27415

తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రంగా నమోదుకావడంతో బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏడాది కనిష్టాని పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.75.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయంలో బ్యాంకు ఈ క్యూ1 ఫలితాలను నమోదు చేసింది. ఫలితాలు మార్కెట్‌ మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో షేరు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనై 7శాతం నష్టపోయి రూ.70.30ల వద్ద ఏడాది కనిష్టానికి చేరుకుంది. ఇది  పసిడి ధరకు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.3:10ని.కు షేరు గత ముగింపు ధర(రూ75.65)తో పోలిస్తే 6.50శాతం నష్టపోయి రూ.70.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.70.30 రూ.110.05లుగా నమోదయ్యాయి.
క్యూ1 ఫలితాలు:- వార్షిక ప్రాతిపదికన బ్యాంకు రూ.243 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంకు ప్రకటించిన రూ.95 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 155శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం 4శాతం వృద్ధి చెంది రూ.3,485 కోట్లను ఆర్జించింది. ఇతర ఆదాయం సైతం 93శాతం పెరిగి రూ.1,195 కోట్లుగా నమోదయ్యాయి. మొండిబకాయిలకు ప్రోవిజన్‌  కేటాయింపులు 17శాతం తగ్గి రూ.1873కోట్లుగా నమోదయ్యాయి. 
పెరిగిన ఎన్‌పీఏలు:- 
సమీక్షిస్తున్న త్రైమాసిక కాలంలో నికర, స్థూల ఎన్‌పీఏలు పెరిగాయి. ఈ క్యూ1లో స్థూల ఎన్‌పీఏలు రూ.60,661.12 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్యూ1లో ఇవి రూ.60,604.46 కోట్లుగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 5.61శాతం నుంచి 5.79శాతంగా నమోదయ్యాయి. ప్రోవిజన్‌ కవరేజ్‌ నిష్పత్తి 66.67 శాతం నుంచి 77.18శాతానికి మెరుగైంది. 



You may be interested

5నెలల కనిష్టం వద్ద నిఫ్టీ ముగింపు

Tuesday 30th July 2019

బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో షేర్ల భారీ పతనంతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ 289 పాయింట్లను కోల్పోయి 37,397 వద్దకు, నిఫ్టీ  104 పాయింట్లను నష్టపోయి 11100 దిగువున 11,085 వద్ద స్థిరపడ్డాయి. ఈ స్థాయిలు సెన్సెక్స్‌కు రెండున్నర నెలల కనిష్టస్థాయి కాగా,  నిఫ్టీ ఇండెక్స్‌కిది 5నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా

అకస్మాత్తుగా అమ్మకాలు: నిఫ్టీ 110 పాయింట్లు క్రాష్‌

Tuesday 30th July 2019

మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో నెలకొన్న అనూహ్య అమ్మకాలతో సూచీలు భారీ నష్టాన్ని చవిచూసాయి. నిఫ్టీ ఇండెక్స్‌ తనకు కీలకమైన 200డీఎంఏ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమై ఆ స్థాయికి కిందకు పతనమవడంతో అమ్మకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ బ్యాంకు షేర్లు భారీ నష్టాల్ని చవిచూసాయి.  ఫలితంగా మార్చి 11 తరువాత నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి 11100 స్థాయిని కోల్పోయింది.

Most from this category