బ్యాంక్ ఆఫ్ బరోడా 12 శాతం అప్
By Sakshi

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు ఆఫ్ బరోడా నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ కంపెనీ షేర్లు గురువారం 12 శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 128.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా షేరు 12 శాతం లాభపడి రూ.143.60ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.126.2)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.132.70ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.90.70 రూ.157.45లుగా నమోదయ్యాయి. ఇదే సమయానికి సెన్సెక్స్ 225 పాయింట్ల లాభంతో 39336.01 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11812.85ల వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
5రోజుల కోసం కాదు.. 5ఏళ్ల కోసం చూడాలి
Thursday 23rd May 2019దేశీయ మార్కెట్లో గురువారం వచ్చిన ర్యాలీ క్రమంగా చప్పబడుతోంది. పలువురు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల నుంచి దిగివచ్చాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఆరంభలాభాలను పోగొట్టుకుని కేవలం స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడం అనవసరమని, సుస్థిర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మార్కెట్లో మరింత ర్యాలీ ఉంటుందని, అందువల్ల ఐదేళ్ల కాలానికి వేచిచూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్థూల ఆర్థికాంశాలపై ఆందోళనలతో
సెన్సెక్స్@40000.. నిఫ్టీ@12000..
Thursday 23rd May 2019దేశీయ మార్కెట్లు చరిత్ర సృష్టించాయి. ఫస్ట్‌టైమ్ సెన్సెక్స్ 40వేల పాయింట్లను, నిఫ్టీ 12వేల పాయింట్లను తాకాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో దేశీయ మార్కెట్లు గురువారం జోరు చూపిస్తున్నాయి. మరోసారి ఎన్డీయే సర్కార్ ఖాయమన్న సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 11901 పాయింట్ల వద్ద పయనం ఆరంభించింది. ఉదయం 10.38 సమయానికి నిఫ్టీ 12006 పాయింట్ల వద్ద,