News


ఏజీఆర్‌ ఎఫెక్ట్‌- బ్యాంకులు వీక్‌

Friday 17th January 2020
Markets_main1579233900.png-30983

టెలికం కంపెనీలు దాఖలు చేసుకున్న  సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. టెలికం కంపెనీలకు భారీగా రుణాలిచ్చిన జాబితాలో ప్రధానంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ తదితరాలున్నాయి. దేశీ టిలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించవలసిందేనంటూ సుప్రీం కోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లు బలహీనపడ్డాయి. టెలికం కంపెనీలు తాజాగా సుప్రీం కోర్టును బకాయిల చెల్లింపులకు గడువు పెంచమని అభ్యర్థించడంతోపాటు.. క్యురేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేసే వీలున్నట్లు వెలువడిన వార్తలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఇది బ్యాంకింగ్‌ రంగానికి సానుకూల అంశమే అయినప్పటికీ వొడాఫోన్‌ ఐడియా కంపెనీ బకాయిలు అత్యధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలియజేశారు. లైసెన్స్‌ ఫీజు, స్ప్రెక్టమ్‌ వినియోగ చార్జీలుసహా వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ. 53,000 కోట్లవరకూ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఏజీఆర్‌ల విషయంలో ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందకపోతే కార్యకలాపాలు నిలిపివేసే(దివాళా) పరిస్థితులు తలెత్తవచ్చని ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా పేర్కొన్న కారణంగా బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

బ్యాంక్‌ నిఫ్టీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్షీణించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.5 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, పీఎస్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీవోబీ 2.6-1 శాతం మధ్య నష్టపోగా.. ప్రయివేట్‌ రంగంలో ఐడీఎఫ్‌సీ ఫస్డ్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ 5.5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ 0.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. 



You may be interested

వొడాఫోన్‌ 30 శాతం క్రాష్‌...ఎయిర్‌టెల్‌ 5 శాతం అప్‌

Friday 17th January 2020

సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీం కోర్డు కొట్టివేయడంతో శుక్రవారం టెలికాం రంగ షేర్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండంగా, వోడా ఫోన్‌ షేరు మాత్రం భారీ నష్టాన్ని చవిచూసింది. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్‌ నిర్వచనం

నష్టాల ప్రారంభం

Friday 17th January 2020

సుప్రీం కోర్టు టెలికాం కంపెనీల ఏజీఆర్‌ చెల్లింపులపై పిటీషన్‌ కొట్టివేయడంతో ఆ షేర్లతో పాటు, ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడనున్న నేపథ్యంలో శుక్రవారం స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  50 పాయింట్ల నష్టంతో 41,950 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల నష్టం‍తో 12,340 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

Most from this category