News


బ్యాంకింగ్‌లో అమ్మకాలు- బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం డౌన్‌

Tuesday 31st December 2019
Markets_main1577766041.png-30548

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం నీరసించింది. వెరసి వరుసగా రెండో రోజు బ్యాంకింగ్‌ కౌంటర్లు వెనకడుగు వేస్తున్నాయి. ఉదయం 9.40 ప్రాంతం‍లో బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 0.75 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.4 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! కాగా..సోమవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 0.65 శాతం చొప్పున నష్టపోయాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ బలహీన ట్రెండ్‌ కనిపిస్తోంది.

 



You may be interested

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు

Tuesday 31st December 2019

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్‌ పీవీ రాంప్రసాద్‌ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్‌ చైర్మన్‌, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400),  పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక

2019 బిజినెస్‌: కొత్త బాధ్యతలు

Tuesday 31st December 2019

జనవరి 8 : అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌. మే 31: దేశ ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్‌. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు. జూలై 30: విప్రో చైర్మన్‌గా ప్రేమ్‌జీ బాధ్యతల విరమణ. కుమారుడు రిషేద్‌కు బాధ్యతలు.    

Most from this category