News


అమ్మకాల షాక్‌- బ్యాంకింగ్‌ బోర్లా

Friday 20th March 2020
Markets_main1584681415.png-32593

నాలుగు వారాల్లో 35 శాతం పతనం
హెచ్‌డీఎఫ్‌సీ ద్వయానికి తప్పని షాక్‌
కుప్పకూలిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
ఐసీఐసీఐ, యాక్సిస్‌ నేలచూపులో

గత కొంతకాలంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల ఫేవరెట్‌ రంగంగా నిలుస్తూ వచ్చిన బ్యాంకింగ్‌ ఇటీవల కాలంలో బేర్‌మంటోంది. భారీ అమ్మకాలతో గ్రీన్‌చిప్స్‌గా పేర్కొనే హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం నష్టాలతో డీలా పడుతున్నాయి. ఈ బాటలో ప్రయివేట్‌ రంగ దిగ్గజాలు యాక్సిస్‌, ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా సైతం నేలచూపులతోనే కదులుతున్నాయి. వెరసి ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన గరిష్టం నుంచి ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 35 శాతం దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడంతోపాటు.. భయాందోళనలు కలిగిస్తుండటంతో స్టాక్‌ మార్కెట్లు పతనబాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలలుగా ర్యాలీ చేస్తూ వచ్చిన బ్యాంకింగ్‌ కౌంటర్లలో నిరాటంక అమ్మకాలకు తెరలేచింది. ఇందుకు ప్రధానంగా నిఫ్టీకి సైతం ప్రాతినిధ్యంవహించే బ్యాంక్‌ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఫీఐలు) పదేపదే అమ్మకాలు చేపడుతుండటం కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌
సాంకేతికంగా మార్కెట్లు బేర్‌ ట్రెండ్‌లోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గత నెల రోజుల్లో బ్యాంకింగ్‌ రంగంలో కొన్ని కౌంటర్లు ఏకంగా 60 శాతం పడిపోయినట్లు తెలియజేశారు. దీంతో మోర్గాన్‌ స్టాన్లీ తదితర విదేశీ రీసెర్చ్‌ సంస్థలు బలమైన ఫండమెంటల్స్‌ ఉన్నట్లు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర కౌంటర్లు సైతం నీరసిస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌తో పోలిస్తే ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లకే అధికంగా అమ్మకాల సెగ తగులుతోంది. ఇటీవల ప్రయివేట్‌ రంగ  సంస్థ యస్‌ బ్యాంక్‌ వైఫల్యం చెందడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. యస్‌ బ్యాంక్‌ డిపాజిటిర్ల పరిరక్షణకు పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ బెయిల్‌అవుట్‌ ఇవ్వడం సెంటిమెంటును బలహీనపరచినట్లు గ్లోబల్‌ బ్రోకింగ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ పేర్కొంది.  

ఇదీ పతన తీరు
గత నెల రోజులను పరిగణిస్తే.. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో ఇండస్‌ఇండ్‌ అత్యధికంగా 64 శాతం కుప్పకూలింది. ఈ షేరు 52 వారాల గరిష్టం రూ. 1834కాగా.. ఎన్‌ఎస్‌ఈలో నేటి(శుక్రవారం) ఉదయం 10.25 ప్రాంతంలో7 శాతం పతనమై రూ. 414 వద్ద ట్రేడవుతోంది. ఇక బంధన్‌ బ్యాంక్‌ 49 శాతం పడిపోయింది. ఏడాది గరిష్టం రూ. 650కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 219 వద్ద కదులుతోంది. ఈ బాటలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ 46 శాతం తిరోగమించింది. ప్రస్తుతం రూ. 21 వద్ద కదులుతోంది. రూ. 18 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 41 శాతం క్షీణించింది. ఏడాది గరిష్టం రూ. 716కాగా.. ప్రస్తుతం రూ. 175 వద్ద ట్రేడవుతోంది.  

దిగ్గజాలు సైతం
బ్యాంకింగ్‌ దిగ్గజాలలో యాక్సిస్‌ 42 శాతం పడిపోయింది. ఈ షేరు ఏడాది గరిష్టం 828కాగా.. నేటి ఉదయం 10.30 ప్రాంతంలో రూ. 424 వద్ద ట్రేడవుతోంది. ఇక ఐసీఐసీఐ గత నెల రోజుల్లో 39 శాతం వెనకడుగు వేసింది. ఏడాది గరిష్టం రూ. 552కాగా.. ప్రస్తుతం 2.5 శాతం నష్టంతో రూ. 330 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 323 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. పీఎస్‌యూ స్టేట్‌బ్యాంక్‌ షేరు 35 శాతం పతనమైంది. ఏడాది గరిష్టం రూ. 374 కాగా.. ప్రస్తుతం రూ. 207 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 31 శాతం నష్టపోయింది. ఏడాది గరిష్టం రూ. 1305కాగా.. ప్రస్తుతం రూ. 861 వద్ద కదులుతోంది. తొలుత రూ. 825 దిగువకూ చేరింది. కొటక్‌ మహీంద్రా 30 శాతం తిరోగమించింది. ఏడాది గరిష్టం రూ. 1740కాగా.. ప్రస్తుతం రూ. 1186 వద్ద ట్రేడవుతోంది.
 You may be interested

ఆటుపోట్లలో ఐటీ, ఫార్మా.. జోరు

Friday 20th March 2020

5 శాతం జంప్‌చేసిన ఐటీ ఇండెక్స్‌ ఫార్మా కౌంటర్లకూ భారీ డిమాండ్‌ ఐటీకి రూపాయి లాభం ఫార్మాకు ఎగుమతుల దన్ను దేశీయంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవచిచూస్తున్నాయి. లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. అయితే ఐటీ, ఫార్మా రంగాలకు తాజాగా డిమాండ్‌ కనిపిస్తోంది. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్ట రికార్డును సృష్టిస్తూ 65 మార్క్‌ దిగువకు సైతం పతనంకావడంతో ఐటీ కంపెనీలు లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే

రూ.40,000పైకి పసిడి

Friday 20th March 2020

 ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో శుక్రవారం దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.413 పెరిగి  10 గ్రాముల పసిడి రూ.40,110.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరగడం, గురువారం ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రుపాయి విలువ భారీగా పతనమై, చరిత్రాత్మక కనిష్టానికి చేరడంతో బంగారం ధర  దేశీయంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో

Most from this category