బ్యాంక్ నిఫ్టీ 1 శాతం జంప్
By Sakshi

మార్కెట్ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మిడ్‌సెషన్ సమయానికి తిరిగి లాభాల్లోకి మళ్లి, తదుపరి 1 శాతం జంప్‌చేసింది. బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ నేడు 30,567.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్ అరశాతం(151 పాయింట్లు) నష్టపోయి 30,567.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రైవేట్ రంగ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా ఇండెక్స్ ఇంట్రాడే కనిష్టస్థాయి(30,567.65) నుంచి రికవరి బాట పట్టింది. దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడి 30,913.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. యాక్సిస్ బ్యాంక్ 2.50శాతం లాభపడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ 1.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకు షేర్లు 1శాతం పెరిగాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో యస్ బ్యాంక్ షేర్లు 2శాతం నష్టపోయింది. ఇండస్ ఇండ్ 1శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.3:00నిల.కు బ్యాంక్ నిఫ్టీ గత ముగింపు(30,602.05)తో పోలిస్తే దాదాపు 1శాతం లాభంతో 30,885.10 వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
11850 పాయింట్లు దాటేవరకు బలహీనమే!
Tuesday 25th June 2019నిఫ్టీపై నిపుణుల అంచనా గతవారం నిఫ్టీ 11625- 11640 రేంజ్లో మద్దతు తీసుకొని పైకి ఎగిసింది. అయితే ఈ వారం తిరిగి బలహీనపడి 11700 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో బలహీనత తొలగాలంటే 11850 పాయింట్ల పైన బలంగా ముగియాలని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ఆప్షన్స్ చూస్తే 11600- 11700 పాయింట్ల వద్ద అధిక ఓఐ కనిపిస్తోంది. అందువల్ల ఈ స్థాయిల వద్ద మద్దతు దొరకవచ్చు. నిఫ్టీ ప్రస్తుతం
టాటాస్టీల్, జేఎస్డబ్ల్యూస్టీల్కు రేటింగ్ కోత
Tuesday 25th June 2019ప్రముఖ రేటింగ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ ... టాటాస్టీల్, జేఎస్డబ్ల్యూసీల్ కంపెనీల రేటింగ్‌పై కోతను విధించింది. ప్రస్తుతం స్టీల్ ధరలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అలాగే ఎర్నింగ్ రిస్క్, వాల్యూవేషన్లు విపరీంగా పెరిగాయి. దీంతో జూలై - సెప్టెంబర్ క్వార్టర్లో ఐరన్ ఓర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ఐరన్ ఓర్ ధరలు కంపెనీల వ్యయ నియంత్రణ చర్యలపై భారంగా మారేందుకు అవకాశం ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ చెప్పుకొచ్చింది.