News


32,000పైకి వెళ్లి, కిందకు దిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 2nd December 2019
Markets_main1575279166.png-30004

సూచీలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం మిడ్‌సెషన్‌ కల్లా 32,000 మార్కును కోల్పోయింది. నేడు ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు(31946.10)తో పోలిస్తే 62 పాయింట్ల లాభంతో 32వేల పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 178 పాయింట్లు(0.25శాతం) పెరిగి 32024.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడికి కారణంగా ఇంట్రాడే గరిష్టం(32024.10) నుంచి 1శాతం వరకూ నష్టపోయి 31,720.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,946.10)తో పోలిస్తే 0.35శాతం నష్టంతో 31,835.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌బ్యాంక్‌ 6శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌ 2.50శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌ 1.25శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.75శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతం, బ్యాంక్‌ ఆఫ్ బరోడా బ్యాంక్‌ 0.30శాతం నష్టపోయాయి. మరోవైపు కోటక్‌ బ్యాంక్‌ 1శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ అరశాతం, పీఎన్‌బీ బ్యాంక్‌ పావుశాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.25శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఆరంభ లాభాలు ఆవిరి

Monday 2nd December 2019

సూచీలు సోమవారం ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 8పాయింట్లు స్వల్ప లాభంతో 40,802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12050 దిగువన 12,048 వద్ద ముగిసింది. ఒక్క మెటల్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా అటో రంగ షేర్లు  అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల క్షీణతతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 75 పాయింట్లు నష్టపోయి 32వేల

కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్ సస్పెన్షన్‌

Monday 2nd December 2019

 కార్వీ స్టాక్‌ బ్రోరింగ్‌ లిమిటెడ్‌ తన సొంత ఖాతాదారులకు చెందిన రూ.2300 కోట్ల ధనాన్ని దుర్వినియోగంపై ఎక్చ్సేంజీలు ఘాటుగా స్పందించాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సోమవారం కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశాయి. సెబీ నియమాలను ఉల్లఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్చ్సేంజీలు తెలిపాయి. ఈక్విటీ, డెరివేటివ్స్‌, కమోడిటీలకు కూడా ఈ రద్దు వర్తిస్తుంది. తదుపరి ఎంసీఎక్స్‌ కూడా కార్వీ సభ్యత్వాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నవంబర్‌

Most from this category