News


30,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 30th October 2019
Markets_main1572418395.png-29232

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,000 పైన ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు వరుసగా రెండో రోజూ లాభాలతో 30,005.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 244 పాయింట్ల(0.85శాతం) వరకు లాభపడి 30117.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(29873.05)తో పోలిస్తే 0.70శాతం(204.70పాయింట్లు) లాభంతో 30,077.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన మొత్తం 12 షేర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు 3 శాతంపైగా పెరిగాయి. ఈ ఇండెక్స్‌లో అధికంగా వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1 శాతం పెరగ్గా, ఎస్‌బీఐ 2 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1 శాతం చొప్పున ఎగిసాయి. 
 పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీ:-
లాభాల మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. పీఎస్‌యూ సెక్టార్‌కు చెందిన సెంట్రల్‌ బ్యాంక్‌ అత్యధికంగా 11శాతం పెరిగింది. సిండికేట్‌ బ్యాంక్‌ 6.80శాతం లాభపడింది. జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, అలహదబాద్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం నుంచి 4శాతం ర్యాలీ చేశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, పీఎన్‌జీ బ్యాంక్‌ షేర్లు 3శాతం పెరిగాయి. మధ్యాహ్నం గం.12:00లకు ఎన్‌ఎస్‌ఈ ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.57శాతం పెరిగి రూ.2409 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రూపాయి క్షీణత: రాణిస్తున్న ఐటీ షేర్లు

Wednesday 30th October 2019

రూపాయి బలహీన ట్రేడింగ్‌తో బుధవారం ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎన్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1.50శాతం వరకు లాభపడింది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపు(70.84)తో పోలిస్తే 13 పైసలు నష్టపోయింది. రూపీ బలహీనపడటం డాలర్ల​రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగంలో ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్‌ 2.50శాతం లాభపడగా, టీసీఎస్ 2శాతం

ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. ఇప్పుడే కాదు!

Wednesday 30th October 2019

ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ దేశీయ బీమా కంపెనీల్లో పెద్ద కంపెనీ, దేశీయ సంస్థాగత మదుపరుల్లో పెద్దదైన ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తెచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. ఎకానమీలో మందగమనం కొనసాగుతున్నా, బీమారంగం మాత్రం మంచి పనితీరు కనబరుస్తోందన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు...  జూలై చివరికి ఎల్‌ఐసీ ఏయూఎం విలువ రూ. 31 లక్షల కోట్లుంది.   ఈ ఏడాది ఈక్విటీల్లో

Most from this category