News


తీవ్ర హెచ్చుతగ్గులతో బ్యాంక్‌ నిఫ్టీ

Monday 10th June 2019
Markets_main1560160156.png-26206

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌తో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 500 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైంది. నేడు మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31,259.20 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఒకదశలో 300 పాయింట్ల లాభపడి 31,367.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్లో నెలకొన్న కరెక‌్షన్‌తో ఇండెక్స్‌ మళ్లీ పతనబాట పట్టింది. ఇంట్రాడే గరిష్టం(31,367.40) నుంచి 506 పాయిం‍ట్లను కోల్పోయి 30,861.30 కనిష్టస్థాయికి పతనమైంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం ఇం‍డెక్స్‌ భారీ పతనానికి కారణమైంది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు (31,066.55)తో పోలిస్తే 50 పాయింట్ల లాభంతో 31,017.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. యస్‌బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం, పీఎన్‌బీ 2.50శాతం నష్టపోయాయి. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నష్టపోగా, యస్‌బ్యాంక్‌ అరశాతం, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం నష్టపోయాయి. 



You may be interested

మొండిపద్దులంటే ఐసీయూ పేషెంట్లే!

Monday 10th June 2019

పట్టించుకోకపోతే మరింత నష్టం  ఎస్‌బీఐ చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యవస్థలో మొండిపద్దులు ఐసీయూలో పేషెంట్‌ లాంటివని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. వాటిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అప్పుతీసుకున్నవాళ్లనే కాక, ఇచ్చిన సంస్థకు కూడా ఇక్కట్లు తెస్తాయన్నారు. ఫిబ్రవరి 12 సర్క్యులర్‌పై ఆర్‌బీఐ చేసిన తాజా సవరణలు అటు చిన్న, ఇటు పెద్ద బ్యాంకులకు సాయం చేస్తాయన్నారు. మొండిపద్దుల పరిష్కారానికి తీసుకువచ్చిన పాత నిబంధనలను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో తాజాగా

అడాగ్‌ షేర్లను వీడని నష్టాలు

Monday 10th June 2019

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ గ్రూప్‌ షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 20 శాతం నష్టపోయాయి. గతవారం చివర్లో రిలయన్స్‌ పవర్‌ నిరాశజనకమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు నేపథ్యం.  మార్చి త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం రావడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,952 కోట్ల

Most from this category