News


బ్యాంకు నిఫ్టీ 35వేలకు!

Saturday 6th April 2019
Markets_main1554546783.png-24995

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా
ఈ ఏడాది ర్యాలీకి బ్యాంకింగ్‌ రంగమే సారధ్యం వహిస్తోంది. బ్యాంకు నిఫ్టీ చెలరేగిపోవడంతో గత సీరిస్‌లో ప్రధాన సూచీలు సైతం పరుగులు పెట్టాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల జోరు ఏడాది మొత్తం కొనసాగుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 2019లో బ్యాంకు నిఫ్టీ 34-35వేల పాయింట్లను చేరుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సహజ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ సీరిస్‌లో నిఫ్టీకి 11570 పాయింట్ల వద్ద బలమైన మద్దతు ఉందన్నారు. 11761 పాయింట్లపైన స్థిరంగా క్లోజయితే మరింత ముందుకు సాగుతుందన్నారు. పరిస్థితి అనుకూలిస్తే కొత్త గరిష్ఠం అసాధ్యమేమీ కాదని చెప్పారు. ఒకవేళ పైన చెప్పిన మద్దతు కోల్పోతే ఏప్రిల్‌ సిరిస్‌ మొత్తం మార్కెట్‌ కన్సాలిడేషన్‌లోకి మరలుతుందన్నారు. మార్కెట్లో అంతర్లీనంగా చాలా బలం పెరిగిందని వివరించారు. అందువల్ల తాము ప్రస్తుతం బాగా బుల్లిష్‌ అంచనాలతో ఉన్నామని తెలిపారు. బ్యాంకుల హవా కొనసాగుతుందని చెప్పారు. ఐటీ స్టాకులు ప్రస్తుతం నిర్ణీత ట్రేడింగ్‌ శ్రేణి పై అవధిలో కదలాడుతున్నాయని సహజ్‌ చెప్పారు. ఈ దశలో మార్కెట్లో కొంత కరెక‌్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ వచ్చే ఛాన్సులున్నందున వీలు చూసుకొని ఐటీ స్టాకులను దిగువ రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చని సూచించారు. 



You may be interested

మందగమనమే అసలు సమస్య!

Saturday 6th April 2019

వచ్చే వారం మార్కెట్‌ రివ్యూ ఈ వారం నిఫ్టీ ప్రాఫిట్‌ బుకింగ్‌ జోన్‌లోకి ప్రవేశించింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంతో వృద్ధికి స్థూల అంశాలు సహకరించడం లేదని తెలుస్తోంది. వరుసగా మూడు త్రైమాసికాలుగా ఎకానమీలో మందగమనం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రోత్‌ ఇంజన్లు అలసినట్లున్నాయి. దీంతో పలు కేంద్రబ్యాంకులు ఒక్కమారుగా తమ విధానాన్ని సడలీకరించుకుంటున్నాయి. రేట్ల పెంపు ఆలోచనను పక్కనబెట్టి రేట్‌కట్‌ దిశగా మరలుతున్నాయి.

కీలక షేర్లపై యస్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు

Saturday 6th April 2019

బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గోద్రేజ్‌ప్రాపర్టీస్‌ షేర్లు ఇటీవలే ఏడాది గరిష్ఠాలను తాకాయి. ఈ నేపథ్యంలో వీటిని ఇకపై ఎలా ట్రేడ్‌ చేయవచ్చనే విషయంలో యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్టు ఆదిత్య అగర్వాల్‌ అభిప్రాయాలు.. 1. బజాజ్‌ ఫైనాన్స్‌: అప్‌ట్రెండ్‌ బలంగా కొనసాగవచ్చు. చార్టుల్లో బలహీనత కనిపించడంలేదు. రాబోయే రోజుల్లో రూ. 3400ను తాకవచ్చు. 2. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: ఇకపై అప్‌మూవ్‌ పరిమితంగా ఉండొచ్చు. రూ. 7660 వరకు పెరిగే ఛాన్సులున్నాయి. 3. గోద్రేజ్‌

Most from this category