News


కనిష్టం నుంచి 2శాతం కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th January 2020
news_main1578479217.png-30770

ఇరాన్‌ అమెరికా ఉద్రిక్తతలతో ఇంట్రాడేలో దాదాపు 1.50శాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికి నష్టాలను పూడ్చుకుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,995.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒకదశలో 500 పాయింట్లు(1.60శాతం) నష్టపోయి 30899.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్‌ సెషన్‌ నుంచి మార్కెట్‌ రికవరిలో భాగంగా కోల్పోయిన నష్టాలను తిరిగి  పొందింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లలో రికవరి ఇండెక్స్‌ను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించిందని చెప్పవచ్చు. ఫలితంగా ఇంట్రాడే కనిష్టం(30,899.55) నుంచి 552 పాయింట్లు లాభపడి (1.78శాతం) 31,451.85 గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి క్రితం ముగింపు(31,399.40)తో పోలిస్తే 0.08శాతం స్వల్ప నష్టంతో 31,373.65 వద్ద స్థిరపడింది. 

ఇండెక్స్‌లో యస్‌బ్యాంక్‌ 2.22శాతం, ఆర్‌బీఎల్‌ 0.69శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.50శాతం, ఎస్‌బీఐ 0.30శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.10శాతం లాభపడ్డాయి. మరోవైపు పీఎన్‌బీ 1.62శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.15శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోగా, ఫెడరల్‌ బ్యాంక్‌ అరశాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.40శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 0.31శాతం క్షీణించాయి. 



You may be interested

భారీ నష్టాల నుంచి రికవరీ

Wednesday 8th January 2020

తొలుత సెన్సెక్స్‌ 400 పాయింట్లు డౌన్‌ నిఫ్టీ 125 పాయింట్లు పతనం చివరికి స్వల్ప నష్టాలతో సరి ఆటో, మెటల్‌, ఫార్మా వెనకడుగు  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఎదురీత ముందుగా హెచ్చరించిన విధంగా ఇరాన్‌ ప్రతిదాడులకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌ మిసైళ్లను ప్రయోగించడంతో తొలుత విదేశీ మార్కెట్లలో బంగారం, ముడిచమురు ధరలు రివ్వుమన్నాయి. బ్రెంట్‌ చమురు 70 డాలర్లను అధిగమించగా.. పసిడి ఔన్స్‌ 1603 డాలర్లను తాకింది. ఇక

కొత్త పెట్టుబడులకు చాలా సమయం ఉంది!

Wednesday 8th January 2020

పరిశీలించి అడుగెయ్యండి సమీర్‌ అరోరా కార్పొరేట్‌ టాక్స్‌ కోత తర్వాత మార్కెట్‌ పరిధి విస్తృతమవుతుందని ఎక్కువమంది భావించారని, కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదని హీలియోస్‌ క్యాపిటల్‌ అనలిస్టు సమీర్‌ ఆరోరా చెప్పారు. ఆ సమయంలో తాము కూడా కొన్ని స్టాకులను కొన్నామని, వాటిలో కొన్ని మంచి రాబడులు ఇచ్చాయని చెప్పారు. కానీ కొన్ని మాత్రం ఇంకా పాజిటివ్‌గా మారలేదన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా అట్టిపెట్టుకున్న స్టాకులు ఇంతవరకు మంచి ఫలితం చూపలేదన్నారు. కానీ

Most from this category