News


బ్యాంక్‌ నిఫ్టీ కనిష్టం నుంచి 370 పాయింట్ల రికవరీ..!

Thursday 20th February 2020
Markets_main1582182819.png-31958

బ్యాంకింగ్‌ రంగ షేర్ల రికవరీతో మిడ్‌ సెషన్‌ కల్లా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ రికవరీ అయ్యింది. మిడ్‌ సెషన్‌ కల్లా ఇంట్రాడే కనిష్టస్థాయి(30702.45) నుంచి ఏకంగా 372.25 పాయింట్లు లాభపడింది. ఏజీఆర్‌ అంశంలో సుప్రీం కోర్టు తీర్పుతో కష్టాలను ఎదుర్కొంటున్న వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం నుంచి సహాయం అందవచ్చనే అంచనాలతో బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,838.20)తో పోలిస్తే 0.68శాతం లాభం‍తో 31వేలపైన 31,072.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 4శాతం లాభపడింది. ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం లాభపడ్డాయి. యస్‌బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేయగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు మాత్రం పావుశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రూ.2,000కు చేరువలో ఐఆర్‌సీటీసీ

Thursday 20th February 2020

దలాల్‌ స్ట్రీట్‌లో ఐఆర్‌సీటీసీ షేరు పరుగులు ఆపడం లేదు. షేరు గురువారం ట్రేడింగ్‌లో మరోసారి కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసి, రూ.2,000 మ్యాజిక్‌ మార్క్‌కు చేరువయ్యింది. నేడు ఈ షేరు బీస్‌ఈలో రూ.1875.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో ఒక దశలో 6శాతం పెరిగి రూ.1939.80 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. లిస్టింగ్‌ ధర నుంచి

మల్లీప్లెక్స్‌ షేర్లు సూపర్‌ హిట్‌- ఎందుకంటే?

Thursday 20th February 2020

చరిత్రాత్మక గరిష్టానికి పీవీఆర్‌ సినిమాస్‌ సరికొత్త గరిష్టానికి చేరిన ఐనాక్స్‌ లీజర్‌  మందగమనంలోనూ సినిమాలకు కలెక్షన్స్‌ ఫుల్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా మల్టీప్లెక్స్‌ థియేటర్లు వీక్షకులతో కళకళలాడుతున్నాయి. దీంతో మార్కెట్‌ లీడర్‌ పీవీఆర్‌ సినిమాస్‌, ప్రధాన ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్‌ లీజర్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి తాజాగా ఈ రెండు షేర్లూ చరిత్రాత్మక  గరిష్టాలను తాకాయి. నేటి ట్రేడింగ్‌లో పీవీఆర్‌ సినిమాస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 2121ను అధిగమించడం

Most from this category