News


బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం అప్‌!

Friday 24th January 2020
Markets_main1579850317.png-31167

ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మధ్యాహ్నం కల్లా మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా 1 శాతం జంప్‌చేసింది. నేటి ఉదయం 46 పాయింట్ల నష్టంతో 31వేల దిగువున 30,974 వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే. మధ్యాహ్న సెషన్‌లో ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో12:15 గంటలకు మునుపటి ముగింపు (31,004.05)తో పోలిస్తే 1శాతం(296 పాయింట్లు) లాభంతో 31,299.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ షేరు 7శాతం లాభపడింది. ఫెడరల్‌ బ్యాంక్‌ 2శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం, కోటక్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ షేర్లు 1శాతం పెరిగాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. అయితే ఆర్‌బీఎల్‌ షేరు మాత్రం 2శాతం నష్టం పోవడం గమనార్హం. You may be interested

ఎస్‌పీ అపారెల్స్‌, కేఈఐ.. జూమ్‌

Friday 24th January 2020

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 1 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 141 పాయింట్లు పెరిగి 41,528ను తాకగా.. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 12,231 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రిటైల్‌ విభాగాన్ని విక్రయించే ప్రణాళికలు ప్రకటించడంతో ఎస్‌పీ అపారెల్స్‌ కౌంటర్‌ జోరందుకోగా.. నిధుల సమీకరణ వివరాలు వెల్లడించడంతో కేఈఐ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ

ఎస్‌బీఐ అండ- యస్‌ బ్యాంక్‌ కేక

Friday 24th January 2020

రెండు రోజుల్లో 14 శాతం ప్లస్‌ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యలతో గురువారం ఒక్కసారిగా జోరందుకున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. మధ్యాహ్నం 12.15 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 10 శాతం దూసుకెళ్లి

Most from this category