News


కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 4th December 2019
Markets_main1575443165.png-30050

మార్కెట్‌ ప్రారంభంలో నష్టాల్లో ట్రేడైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31,549.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాలతో 169 పాయింట్ల మేర నష్టపోయి 31,444.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి 31,444.00 నుంచి 434 పాయింట్లు లాభపడి 31,878.35 స్థాయిని అందుకుంది. ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,613.35)తో పోలిస్తే 220(0.75శాతం)పాయింట్ల లాభంతో 31,827.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 3శాతం పెరిగింది. యస్‌బ్యాంక్‌ 2.50శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2శాతం, యాక్సిస్ బ్యాంక్‌ 1.50శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ 1శాతం లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.10శాతం పెరిగాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

అధిక వాల్యూషన్లు.. అయినా పర్లేదు!

Wednesday 4th December 2019

హై పీఈ స్టాకుల్లో అధిక కొనుగోళ్లు సాధారణంగా ఒక షేరును కొనేముందు టెక్నికల్స్‌ అధ్యయనం చేసేవాళ్లు అల్ప పీఈ స్థాయి ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపుతారు. పీఈ తక్కువగా ఉంటే వాల్యూషన్లు తక్కువగా ఉన్నట్లు భావిస్తారు. కానీ తాజా మార్కెట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోందని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం అధిక పీఈ స్టాకులను వేలం వెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. పీఈ ఎక్కువగా ఉన్నా పట్టించుకోకుండా కొన్ని షేర్ల

సీబీఎస్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌ సూపర్‌ సక్సెస్‌

Wednesday 4th December 2019

గతవారం ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న కేథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌(సీఎస్‌బీ) నేడు ఎక్చ్సేంజీల్లో భారీ లాభంతో లిస్ట్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.195తో పోలిస్తే 41శాతం లాభంతో రూ.275ల వద్ద లిస్టైంది. ఒకానొక దశలో ఇష్యూ ధర(రూ.195) కంటే 57శాతం వరకు పెరిగి రూ.307 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం. 12:00లకు ఇష్యూ ధరతో పోలిస్తే 53.50శాతం లాభంతో రూ.300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఐపీఓ 22న ప్రారంభమై

Most from this category