News


30,000 పాయింట్ల చేరువలో బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 29th October 2019
Markets_main1572335457.png-29205

ఉదయం ట్రేడింగ్‌లో స్తబ్ధుగా సాగిన బ్యాంకు షేర్లలో మిడ్‌సెషన్‌ కల్లా కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో ఈ సూచీ 30,000 పాయింట్ల స్థాయిని సమీపించింది.  నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 29,527.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో అరశాతం (131 పాయింట్లు) నష్టపోయి 29385.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం అనూహ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ కనిష్టస్థాయి నుంచి రికవరి సాధించింది. ఒకదశలో నిన్నటి ముగింపు(29516) నుంచి నుంచి 1.50శాతం వరకు పెరిగి 29946.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(29516.30)తో పోలిస్తే 1.31శాతం లాభంతో 29,900 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి ఇండెక్స్‌లో యస్‌బ్యాంక్‌ 7.50శాతం లాభపడింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 6శాతం పెరిగింది. ఇండస్‌ ఇండ్‌ 3శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల 1.50శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం పెరగ్గా, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

పన్నురేట్లను తగ్గించినంత మాత్రాన డిమాండ్‌ పుంజుకోదు

Tuesday 29th October 2019

-బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌, సంజయ్‌ మూకిమ్‌  ‘సమీపకాలంలో డిమాండ్‌ పుంజుకోడానికి, ప్రభుత్వం కొత్తగా వ్యక్తిగత ఆదాయపు పన్నురేట్లను తగ్గిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్‌ను తగ్గించడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ అవకాశం ఉంది’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ సంజయ్‌ మూకిమ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అంతేకాకుండా ఫైనాన్సియల్స్‌, ఇండస్ట్రీయల్స్‌,

బ్యాంకు నిఫ్టీలో కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Tuesday 29th October 2019

ప్రధాన సూచీలతో పోలిస్తే ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చూపుతున్న బ్యాంకు నిఫ్టీ క్రమంగా పాజిటివ్‌గా మారుతోంది. సూచీలోని ప్రధాన కంపెనీలు మంచి ఫలితాలు చూపుతుండడంతో బ్యాంకు నిఫ్టీలో బుల్స్‌ సందడి పెరిగింది. నిఫ్టీలో షార్ట్‌కవరింగ్‌, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో తరుగుదల.. ఇవన్నీ మొత్తంమీద మార్కెట్లో పాజిటివ్‌ వాతావరణాన్ని చూపుతున్నాయి. బ్యాంకు నిఫ్టీలో 29-30 వేల మధ్య కాల్స్‌, పుట్స్‌, లాంగ్స్‌, షార్ట్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 29500 పాయింట్ల వద్ద

Most from this category