News


బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం జంప్‌

Tuesday 15th October 2019
Markets_main1571131097.png-28897

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 28,257.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా ఉదయం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రైవేట్‌రంగ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఒకదశలో ఇండెక్స్‌ 1.81 శాతం వరకు లాభపడి 28694.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(28,181.95)తో పోలిస్తే 1.64శాతం(427 పాయింట్లు) పెరిగి 28,643.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఆర్‌బీఎల్‌ అత్యధికంగా 4శాతం పెరిగింది. కోటక్‌ బ్యాంక్‌ 2శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.75శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, పీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. అయితే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు మాత్రం 0.10శాతం నష్టపోయింది. 



You may be interested

మార్కెట్లు అధ్వాన్న స్థితిని దాటేశాయి: దేవన్ చోక్సీ

Tuesday 15th October 2019

-నిర్థిష్టమైన స్టాకులలో ర్యాలీ చూడవచ్చు మార్కెట్లు వాస్తవానికి అనుగుణంగా వాటిని అవి మార్చుకుంటాయని, ఇప్పటికే మార్కెట్లు అధ్వాన్న స్థితిని దాటేశాయని కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఎండీ దేవన్ ఆర్ చోక్సీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... ఐఆర్‌సీటీసీ ధరకు డిమాండ్‌-సరఫరానే కారణం.. ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌) మార్కెట్‌లో బంపర్‌ లిస్టింగ్‌ అయ్యింది. వాల్యుషన్‌ పరంగా ఈ కంపెనీ లిస్టింగ్‌ ప్రీమియంతో ఉంది. ఈ కంపెనీ

హెచ్‌యూఎల్‌పై అనలిస్టులు బుల్లిష్‌!

Tuesday 15th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి  ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ప్రకటించిన ఫలితాలపై పలువురు అనలిస్టులు పాజిటివ్‌గా స్పందించారు. పలు బ్రోకరేజ్‌లు సంస్థ షేరు టార్గెట్‌ను, రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేశాయి. కంపెనీ వాల్యూం వృద్ధి 5-7 శాతం రేంజ్‌లో కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు షేర్‌ఖాన్‌ తెలిపింది. హెచ్‌యూఎల్‌ టార్గెట్‌ను రూ. 2250కి పెంచింది. షేరుపై బుల్లి్‌ష్‌గా ఉన్నట్లు మరో బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌రాఠీ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఏ సంస్థ హెచ్‌యూఎల్‌ షేరు టార్గెట్‌ను

Most from this category