STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్లు జంప్‌

Wednesday 14th August 2019
Markets_main1565762592.png-27758

యుఎస్‌, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై విధించాలనుకున్న 10 శాతం సుంకాన్ని వాయిదా వేయడంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశియ మార్కెట్లు కూడా సానుకూలంగా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.20 సమయానికి 325.60 పాయింట్లు లాభపడి 28001.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.27 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.82 శాతం లాభపడ్డాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)  2.38 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.91 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 1.22 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లయిన  ఫెడరల్‌ బ్యాంక్‌ 3.18 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.73 శాతం, యస్‌ బ్యాంక్‌ 2.24 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.09 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి.1.85 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 0.43 శాతం, లాభపడి ట్రేడవుతుండగా, కోటక్‌ బ్యాంక్‌ మాత్రం 0.68 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.
 You may be interested

ఫార్మా షేర్లకు జర్వం

Wednesday 14th August 2019

7శాతం క్షీణించిన సన్‌ ఫార్మా 7ఏడేళ్ల కనిష్టానికి గ్లెన్‌మార్క్‌ మార్కెట్‌ లాభంతో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఫార్మా రంగ షేర్లు బుధవారం భారీ నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు 3శాతం పతనమైంది. ఈ రంగంలో అదిక వెయిటేజీ కలిగిన డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌, సన్‌ ఫార్మా షేర్ల క్షీణత ఇండెక్స్‌ భారీ పతనానికి కారణమైంది. ఈ క్యూ1లో ఫార్మా కంపెనీల ఫలితాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో

200 కౌంటర్లలో బుల్లిష్‌ సంకేతాలు

Wednesday 14th August 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

Most from this category