News


31,500పైన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 4th July 2019
news_main1562214650.png-26779

బ్యాంకు నిప్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో అరశాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 31,471.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుడంతో ఈ ఇండెక్స్‌ 0.63శాతం (200 పాయింట్లు) లాభపడి 31582.50 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(31,382.30)తో పోలిస్తే 0.58శాతం లాభంతో 31,564.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌ అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2.50శాతం, పీఎన్‌బీ 2శాతం, కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడగా, యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంకు 1శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.10శాతం క్షీణించింది. 
ఉదయం గం.9:55ని.లకు సెన్సెక్స్‌ 112 పాయింట్ల లాభంతో 39,951.44 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 11,950.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రాణిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Thursday 4th July 2019

మార్కెట్‌ స్థిరమైన ర్యాలీలో భాగంగా గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2శాతం వరకు లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 3,269.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో అస్తవ్యస్తమైన ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు పునురుద్ధరణకు రిక్యాపులైజేషన్ ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలతో ఈ రంగ షేర్లకు నేడు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా

తగ్గిన చమురు ధర

Thursday 4th July 2019

అమెరికా చమురు నిల్వలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా పడిపోవడంతో అధిక సరఫరా కారణాన చమురు ధరలు గురువారం(జులై 4) స్వల్పంగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. గత వారం అమెరికా నిల్వలు 30 లక్షల బ్యారెల్‌ల ఉత్పత్తి పడిపోతుందని అంచనా వేయగా అది 11లక్షల బ్యారల్‌ మాత్రమే ఉందని ఎనర్జీ ఇన్ఫ్‌ర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. బెంచ్‌మార్కు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.4 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.60డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌

Most from this category