News


బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Friday 6th September 2019
Markets_main1567754109.png-28237

ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 26,986.50    వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఒకదశలో 333 పాయింట్లు(1.25శాతం) పెరిగి 27,252.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(26,919.70)తో పోలిస్తే 268 పాయింట్లు(1శాతం) లాభంతో 27,187.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌ అత్యధికంగా 3శాతం పెరిగింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.50శాతం, కోటక్‌బ్యాంక్‌ 2శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం పెరిగాయి. అయితే ఒక్క యస్‌బ్యాంక్‌ షేర్లు మాత్రం 1శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఈ షేర్లను అమ్మకోలేక బ్రోకరేజ్‌ల ఇక్కట్లు

Friday 6th September 2019

పూల్‌ అకౌంట్ల నుంచి క్లయింట్ల అకౌంట్లు వేరు చేయాలన్న సెబి నిర్ణయం బ్రోకరేజ్‌లకు కొత్త తలనొప్పులు తెచ్చింది. ఇప్పటికే కొని పెట్టుకున్న ఎక్చేంజ్‌ల్లో కదలికలులేని షేర్లు(ఇల్లిక్విడేట్‌ షేర్లు- గ్రూప్‌ ఏలో లేని చిన్నా చితకా కంపెనీల షేర్లు), ఇటీవల కాలంలో బాగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లను అమ్మాలంటే కొనే నాధుడు లేక పలు బ్రోకరేజ్‌లు ఇక్కట్లు పడుతున్నాయి. ఈ రెండు రకాల షేర్లు ప్రస్తుతం బ్రోకరేజ్‌ల వద్ద దాదాపు రూ.

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9శాతం క్రాష్‌..!

Friday 6th September 2019

ఢిల్లీ హైకోర్టులో కంపెనీ, ప్రమోటర్లపై పిల్‌ ధాఖలైందనే వార్తలతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 6శాతం క్షీణించాయి. నేడు ఈ కంపెనీ షేరు బీస్‌ఈలో రూ.420.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేరు అ‍మ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 9.50శాతం క్షీణించి రూ.406.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరు కొత్త ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం.

Most from this category