News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Friday 26th July 2019
Markets_main1564130941.png-27328

  • 1శాతం లాభపడ్డ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

మార్కెట్లో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం లాభపడింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు 29,062.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరు రోజుల వరుస పతనం అనంతరం నేడు మార్కెట్లో జరుగుతున్న కొనుగోళ్లతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఇండెక్స్ ఒక దశలో 300 పాయింట్లు(1శాతం) లాభపడి 29340.75 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(29,043.05)తో పోలిస్తే  277 పాయింట్లు పెరిగి 29,299.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అన్నిరంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 7శాతం పెరిగింది. పీఎన్‌బీ 5శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 4శాతం లాభపడింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 3శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఎస్‌ బ్యాంకు 1శాతం లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేసాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నిన్నటి ముగిసిన జూలై ఎఫ్‌ అండ్‌ ఓ సీరిస్‌లో భాగంగా గత 10 నెలల్లో ఎన్నడూ చూడనంత కష్టాన్ని చవిచూసింది. 

ఇక ఇదే సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 11,294 వద్ద, సెన్సెక్స్‌ 133 పాయింట్లు లాభపడి 37964 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

అస్థిర పరిస్థితులలో లార్జ్‌ క్యాప్‌లను విడిచిపెట్టకండి

Friday 26th July 2019

‘కొన్ని బ్యాంకులు మంచి ఫలితాలను ప్రకటించడం గమనించాం. కానీ ప్రస్తుత పరిస్థితులు సమస్యగా ఉన్నాయి’ అని మోతిలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌ , రిటైల్ రీసెర్చ్ హెడ్, సిద్ధార్థ ఖేమ్కా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. లార్జ్‌ క్యాప్‌లను విడిచిపెట్టొద్దు.. ప్రస్తుత అస్థిర పరిస్థితులలో  నాణ్యమైన  లార్జ్‌క్యాప్‌లను ఎంచుకోవడం మంచిది. అలాగే ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్స్‌ను విడిచిపెట్టడం కూడా మంచిదికాదు. ఇప్పటికే కొన్ని లార్జ్‌ క్యాప్‌

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 26th July 2019

నిన్నటి ట్రేడింగ్‌లో వారం కనిష్టస్థాయికి పతనమైన పసడి ధర శుక్రవారం స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు పసిడి బలపడేందుకు మద్దతినిస్తున్నాయి. ఫలితంగా నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు పెరిగి  1,417.70డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే.., నేటి రాత్రి అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తతతో లాభాలు పరిమితమయ్యాయి.  దేశీయంగా స్వల్ప తగ్గింపు:-  దేశీయ ఎంసీఎక్స్‌

Most from this category