News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌..!

Monday 1st July 2019
Markets_main1561961895.png-26710

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 1శాతం ర్యాలీ చేసింది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 31,271.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(1.50శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు (1శాతం) ర్యాలీతో ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టింది. దాదాపు 1శాతం వరకు ర్యాలీ చేసి 31,380.70 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిని చేరుకుంది. ఇండెక్స్‌లో ఐడీసీఎఫ్‌ ఫస్ట్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు 2శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. యస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో ఫెడరల్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు పావుశాతం నుంచి 0.10శాతం వరకు క్షీణించాయి. ఉదయం గం.11:20ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,105.20)తో పోలిస్తే 0.80శాతం లాభంతో 31,355.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇక ఇదే సమయానికి నిఫ్టీ ఇండెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 11,870.90 వద్ద, సెన్సెక్స్‌ 277 పాయింట్లు పెరిగి 39,671.77 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 



You may be interested

ఏడాది కనిష్ఠానికి 67 స్టాక్‌లు

Monday 1st July 2019

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో  67 స్టాక్‌లు తమ 52 వారాల కనిష్ఠ స్థాయిని సోమవారం తాకాయి. ఏక్సిలియ సొల్యుషన్స్‌ ఇండియా, అరవింద్‌ స్మార్ట్‌ స్పేసస్‌, కాస్ట్రోల్‌ ఇండియా, బర్న్‌పుర్‌ సిమెంట్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఏడాది కనిష్ఠాన్ని తాకిన స్టాక్‌లలో ఉన్నాయి. వీటితో పాటు దన్సేరి ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా, గ్లెన్‌ మార్క్‌ పార్మా, హెల్త్‌ కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్థాన్‌ మీడియా వెంచర్స్‌, విండ్సర్‌ మిషెన్స్‌ కూడా తమ ఏడాది

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌

Monday 1st July 2019

రిస్క్‌ తగ్గిస్తూ.. డైనమిక్‌ రాబడులు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ విభాగంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ (వీటినే డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ అని కూడా అంటారు) ఈక్విటీలో, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా డైనమిక్‌గా ఇన్వెస్ట్‌ చేస్తూ రాబడులను ఇచ్చే విధానంలో పనిచేస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లు తక్కువ వ్యాల్యూషన్లకు చేరినప్పుడు అందులో పెట్టుబడులు పెంచుకోవడం, మార్కెట్లు అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం అనే రిస్క్‌ బ్యాలన్స్‌డ్‌ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ప్రస్తుతం

Most from this category