News


లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Wednesday 12th February 2020
Markets_main1581483216.png-31716

మార్కెట్‌ రెండో రోజూ ర్యాలీలో భాగంగా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,554.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో ఇండెక్స్‌ 0.81శాతం లాభపడి 31554.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:10ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు 31,300.60తో పోలిస్తే 0.60శాతం లాభంతో 31,495.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో కోటక్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో యస్‌బ్యాంక్‌ షేరు 4శాతం నష్టా‍న్ని చవిచూసింది. పీఎన్‌బీ షేరు 1శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టాన్ని చవిచూశాయి. 



You may be interested

అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌ ప్లాన్‌ రద్దు యోచనలో సెబీ?!

Wednesday 12th February 2020

బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌లో ఇంట్రాడే లావాదేవీల వాటా 50 శాతం  రోజువారీ లేదా డెరివేటివ్‌ విభాగంలో లావాదేవీల నిర్వహణకు ట్రేడర్లు చెల్లించవలసిన అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌(ముందస్తు చెల్లింపు) ప్రణాళిక రద్దయ్యే అవకాశమున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశీ కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోసాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ అంశాన్ని సానుకూల థృక్పథంతో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌లో 50-70 శాతం వరకూ ఇంట్రాడే లావాదేవీల నుంచే నమోదవుతూ ఉంటుందని సంబంధిత

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోకు సెబీ ఓకే

Wednesday 12th February 2020

త్వరలో పబ్లిక్‌ ఇష్యూ రూ. 10,000 కోట్ల సమీకరణ! పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాం‍క్‌ క్రెడిట్‌ కార్డుల అనుబంధ విభాగం ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీవో చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ. 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఎస్‌బీఐ కార్డ్స్‌

Most from this category