News


బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం అప్‌

Wednesday 11th September 2019
Markets_main1568184223.png-28305

యస్‌ బ్యాంక్‌, యస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,639.05 వద్ద ప్రారంభమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన యస్‌బ్యాంక్‌ లో కొంత వాటాను పేటిఎం సంస్థ కొనుగోలు చేస్తుందనే వార్తలతో యస్‌బ్యాంక్‌ షేర్లు నేడు 15శాతం ర్యాలీ చేయడంతో పాటు యస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం, యాక్సిస్‌బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడటంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం వరకు పెరిగి 27782.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,504.65)తో పోలిస్తే 0.95శాతం లాభంతో 27,764.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన యస్‌బ్యాంక్‌ షేర్లు 14శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ షేర్లు 3శాతం, ఇండస్‌ ఇండ్‌ 2.50శాతం, యస్‌బీఐ, ఆర్‌బీఎల్‌ షేర్లు 2శాతం లాభంతో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం వరకు పెరిగాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రం 1శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. You may be interested

అధిక ఉత్పత్తే అసలు సమస్య...

Wednesday 11th September 2019

ఆటో రంగ సంక్షోభంపై రాజీవ్‌ బజాజ్‌ దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం‘‘అధిక ఉత్పత్తి మరియు అధికంగా స్టాకులు పేరకపోవడం’’ అని బజాజ్‌ ఆటో ఎండీ రాహుల్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంఓ ఆటోమొబైల్‌ రంగంపై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్‌టీ కౌన్సిల్‌

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనొచ్చు!

Wednesday 11th September 2019

కమోడిటీ నిపుణుల సూచన పోర్టుఫోలియోలో బంగారం కూడా ఉండాలనుకునే ఇన్వెస్టర్లు 2019-20 సీరిస్‌4 సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బాండ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్‌గా ఉన్నాయి. వారాంతం వరకు వీటికి సబ్‌స్క్రైబ్‌ కావచ్చు. వీటికి డిజిటల్‌ రూపంలోనైతే గ్రాముకు రూ.3840, భౌతిక చెల్లింపులైతే గ్రాముకు రూ. 3890 చొప్పున చెల్లించాల్సిఉంటుంది. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లు పదేళ్ల బుల్‌రన్‌ చివరి సంవత్సరంలో ఉన్నాయని, చాలా ఓవర్‌

Most from this category