News


ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 27th September 2019
Markets_main1569558878.png-28582

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో  మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ 50 10.75 పాయింట్లు కోల్పోయి 11,560.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 18.92 పాయింట్లు లాభపడి 39,008.66 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి వలన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌  59.95 పాయింట్లు నష్టపోయి 30029.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.50 శాతం లాభపడి రూ. 1248.70 వద్ద ట్రేడవుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.95 శాతం నష్టపోయి రూ. 447.65 వద్ద, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.58 శాతం నష్టపోయి రూ.1539.00 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ప్రభుత్వం రంగ బ్యాంక్‌ షేర్లయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)0.85  శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.72 శాతం లాభపడి ట్రేడవుతండగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం 0.42 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. అదే విధంగా  ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లయిన యెస్‌ బ్యాంక్‌ 2.74 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.15 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.85 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 0.51 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.37 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.01 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.



You may be interested

పన్ను కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలి

Friday 27th September 2019

ఉత్పత్తుల ధరలను తగ్గించాలి దాంతో అమ్మకాలు పెరుగుతాయి ఆర్థిక గణాంకాలు అనుకూలంగా ఉన్నాయి హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌పరేఖ్‌  న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే తగ్గించిన కార్పొరేట్‌ పన్ను ప్రయోజనాన్ని లాభాల్లో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను తగ్గించడం ద్వారా కస్టమర్లకు బదలాయించాలని ప్రముఖ బ్యాంకర్‌, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ సూచించారు. తద్వారా కంపెనీల ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును తగ్గించడం అన్నది దేశ వృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయం వ్యకర్తం చేశారు. ప్రభుత్వ

పండుగ సీజన్‌లో అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లు

Friday 27th September 2019

న్యూఢిల్లీ:- ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఈ పండుగల సీజన్‌లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ‘గ్రేట్‌ ఇండియాన్‌ ఫెస్టివల్’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్యాటగిరీ మెనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్ తివారీ తెలిపారు. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని చెప్పారు. బజాన్‌ ఫిన్‌సర్వ్‌, కార్డుల ద్వారా

Most from this category