News


బ్యాంక్‌ నిఫ్టీ: గరిష్టం నుంచి 578 పాయింట్లు డౌన్‌

Monday 20th January 2020
Markets_main1579505099.png-31047

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం మిడ్‌సెషన్‌ గరిష్టస్థాయి నుంచి 578 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3 ఫలితాలు అంచనాలు మించిన నమోదు కావడంతో నేడు ఈ భారీ గ్యాప్‌లో ప్రారంభమైంది. ఫలితంగా నేడు ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,590.65)తో పోలిస్తే 334 పాయింట్ల భారీ లాభంతో 31,923.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అనంతరం మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల్లో ఇండెక్స్‌ ఇదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2శాతం నష్టపోయింది. అలాగే ఇదే సూచీలోని కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకింగ్‌ షేర్ల పతనం కూడా సూచీల లాభాల హరించుకుపోయేందకు కారణమయ్యాయి. ఒకదశలో ఇండెక్స్‌ గరిష్టస్థాయి (31,923.95) నుంచి 576 పాయింట్లు (2 శాతం) నష్టపోయి 31,345.90 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమైంది. మధ్యహ్నాం గం.12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,590.65)తో పోలిస్తే 261 పాయింట్లు నష్టంతో 31,350.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ఆర్‌బీఎల్‌ షేర్లు 4.40శాతం నష్టపోయింది. పీఎన్‌బీ, కోటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2శాతం నష్టపోయాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.50శాతం పతనమయ్యాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ యస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ​ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం క్షీణించాయి. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌ మాత్రం 1.50శాతం లాభపడింది. 



You may be interested

నేడు బడ్జెట్‌ హల్వా ఉత్సవం

Monday 20th January 2020

హల్వా తయారితో బడ్జెట్‌ రూపలక్పనకు శ్రీకారం! -నార్త్‌ బ్లాక్‌లో హల్వా ఉత్సవం న్యూఢిల్లీ: భారత సంప్రదాయంలో ఏ పనిని ప్రారంభించాలన్నా మొదట స్వీట్‌తో నోరు తీపిచేసుకుని ప్రారంభించడం ఆనవాయితి. ఇక ప్రతిఏటా బడ్జెట్‌ను రూపొందించే ముందు కూడా అధికారులందరి నోరు తీపిచేయడం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా సోమవారం(జనవరి 20) న హల్వా తయారు చేసి బడ్జెట్‌-2020 రూపకల్పనలో పాల్గొనే అధికారులందరికి ఆర్థిక మంత్రి నార్త్‌ బ్లాక్‌లో నోర్లు తీపి

ఆర్‌ఐఎల్‌ ఈపీఎస్‌ అంచనాల కుదింపు

Monday 20th January 2020

బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్న సీఎల్‌ఎస్‌ఏ నోమురా ఇండియా టార్గెట్‌ రూ. 2020 జియోమార్ట్‌ ద్వారా కిరాణా డిజిటలైజేషన్‌?! ఈ ఏడాది మూడో త్రైమాసిక(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించాక డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌పట్ల సానుకూల ధోరణిని కొనసాగిస్తున్నట్లు పలు బ్రోకింగ్‌ సంస్థలు తెలియజేశాయి. అయితే పెట్రోకెమ్‌ బిజినెస్‌ బలహీనతల నేపథ్యంలో 2020లో ఆర్‌ఐఎల్‌ ఆర్జన 4-6 శాతంమేర నీరసించవచ్చని కొన్ని రీసెర్చ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్‌ మందగమనం, ఆరోమాటిక్‌, పాలిమర్స్‌ విభాగంలో

Most from this category