STOCKS

News


బ్యాంకునిఫ్టీలో బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 13th January 2020
Markets_main1578906723.png-30892

బ్యాంకు నిఫ్టీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ పరిశీలిస్తే రేంజ్‌బౌండ్‌ కదలికలకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు నిఫ్టీలో ఐవీ(ఇంప్లైడ్‌ వొలటిలిటీ) పెరుగుతోంది, పీఎస్‌యూబ్యాంకుల్లో అమ్మకాలు కనిపిస్తున్నాయి, ప్రైవేట్‌ బ్యాంకులు చాలా వరకు అలసినట్లున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో భారీ ర్యాలీకి ఛాన్సులు స్వల్పంగానే ఉన్నాయి. గతవారం ప్రధాన బ్యాంకు షేర్లలో షార్ట్స్‌ ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఒక మోస్తరు బేరిష్‌వ్యూహం. ప్రస్తుత మార్కెట్‌ ధరకు దగ్గరలోని పుట్‌ను కొనుగోలు చేసి, అంతకన్నా తక్కువస్ట్రైక్‌ప్రైస్‌ పుట్‌ను విక్రయించడం.. ఈ వ్యూహంలో జరుగుతుంది. కొన్నపుట్‌కు అమ్మిన పుట్‌ హెడ్జ్‌ చేస్తుంది. వ్యూహంలో లాభాలు పరిమితం కానీ రిస్కు తక్కువగా ఉంటుంది.

వ్యూహం..
32100 పుట్‌ ఒక లాట్‌ కొనుగోలు చేయాలి. ఇదే సమయంలో 31500 పుట్‌ ఒక లాట్‌ను విక్రయించాలి. వ్యూహం రిస్కురివార్డు నిష్పత్తి: 2.2:1. వ్యూహంలో నష్టం కానీ లాభం కానీ పరిమితంగా ఉంటాయి. వ్యూహానికి బ్రేక్‌ ఈవెన్‌ పాయింటు 31912 పాయింట్లు. స్టాప్‌లాస్‌ 32100 పాయింట్లకు పైన 188 పాయింట్లు లేదా రూ. 3760. లాభం 31500 పాయింట్ల వద్ద లేదా రూ. 8250. కాల పరిమితి 4 రోజులు. వ్యూహంలో స్ట్రైక్‌ ప్రైస్‌లను స్పా్‌ట్‌ప్రైస్‌కు అనుగుణంగా అటుఇటు మార్చుకోవాలి. 

ఈ వ్యూహం నిపుణుల సలహా మాత్రమే! పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

టాటా ఎలక్సీ, ఆశాపురా, హడ్కో..జూమ్‌

Monday 13th January 2020

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డ్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉపశమించడంతోపాటు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లోనే అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. మధ్యాహ్నం 2.40 సమయంలో సెన్సెక్స్‌ 227 పాయింట్లు జంప్‌చేసి 41,826కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,320 వద్ద ట్రేడవుతోంది. తొలుత

షుగర్‌ షేర్లకు డిమాండ్‌

Monday 13th January 2020

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌ ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర తయారీ కంపెనీల కౌంటర్లు మరోసారి వెలుగులోకి వచ్చాన్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూడంతో పలు కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. చెరకు దిగుబడితోపాటు.. చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా  షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం... కారణాలేవిటంటే? ఈ సీజన్‌(అక్టోబర్‌ 2019-

Most from this category