News


‘బేర్‌’మంటున్న బ్యాంకు నిఫ్టీ

Monday 6th January 2020
Markets_main1578284836.png-30697

సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో బ్యాంకునిఫ్టీ భారీగా నష్టపోయింది. 31,910.45 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైన బ్యాంకునిఫ్టీ 31,914.45పాయింట్ల హైని నమోదు చేసి వెనువెంటనే పతనం కావడం ఆరంభించింది. ఉదయం 9.45 నిమిషాల సమయానికి 31,487.10 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 1. 53 శాతం నష్టంతో 31579 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సూచీలో వెయిటేజ్‌ ఉన్న బ్యాంకు స్టాకులన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. సూచీలో అత్యధికంగా పీఎన్‌బీ, బీఓబీ, ఎస్‌బీఐలు 3 శాతం పైగా నష్టపోయాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, యస్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌; యస్‌బ్యాంక్‌లు 2 శాతం పైగా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులు 1 శాతం పైగా, కోటక్‌బ్యాంక్‌ అరశాతం మేర నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు నిఫ్టీలో లేని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దీంతో పీఎస్‌యూ బ్యాంకు సూచీ 3.23 శాతం నష్టంతో 2442 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీ 1.43 శాతం నష్టంతో 17477 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇరాన్‌- యూఎస్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మరలాయి. మరోవైపు క్రూడాయిల్‌, బంగారం ధరలు దూసుకుపోయాయి. రూపీ కీలక 72 స్థాయిని కోల్పోయింది. 



You may be interested

నష్టాల మా‍ర్కెట్లోనూ ఈ షేర్లు రయ్‌రయ్‌

Monday 6th January 2020

డిష్‌మన్‌ కార్బొజెన్‌ టైటన్‌ కంపెనీ సవేరా ఇండస్ట్రీస్‌ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 448 పాయింట్లు పతనమైంది. 41,016కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 140 పాయింట్లు దిగజారి 12,087 వద్ద ట్రేడవుతోంది. అయితే విభిన్న వార్తల కారణంగా పతన మార్కెట్లోనూ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో బ్లూచిప్‌ కంపెనీ టైటన్‌తోపాటు..

రుపీ 72 దిగువకు

Monday 6th January 2020

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్‌ ప్రారంభంలోనే 21 పైసలు డౌన్‌ మధ్యప్రాచ్యంలో గత వారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదరనున్న అంచనాల కారణంగా వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీకి షాక్‌ తగిలింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 21 పైసలు నీరసించింది. 72.01 వద్ద మొదలైంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 25 పైసలు(0.35 శాతం) బలహీనపడి 72.05 వద్ద

Most from this category