News


బ్యాంకు నిఫ్టీలో బటర్‌ఫ్లై స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 15th July 2019
Markets_main1563177680.png-27072

నిపుణుల సూచన
గతవారం భారీ నష్టాలు చూసిన సూచీలు ఈ వారాన్ని సైతం నష్టాలతో కొనసాగిస్తున్నాయి. గత వారం బ్యాంకునిఫ్టీ దాదాపు 3 శాతం పతనమైంది. ఇదే సమయంలో సూచీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 2.5 శాతం అన్‌వైండింగ్‌ చూసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో సరైన ఆప్షన్స్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు నిఫ్టీ స్వల్ప రేంజ్‌లోనే కదలాడే ఛాన్సులున్నాయని చెబుతున్నారు. బ్యాంకునిఫ్టీకి 30500-30700 తక్షణ మద్దతుగా నిలుస్తుందని ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ డేటా సూచిస్తోంది. ఇదే సమయంలో వీఐఎక్స్‌ మందకొడిగా ఉండడం సూచీల్లో తీవ్ర కదలికలకు ఛాన్సులు తక్కువని తెలియజేస్తోంది. వీఐఎక్స్‌ 15 స్థాయిని దాటితే మాత్రం డౌన్‌ట్రెండ్‌ వేగవంతంమవుతుంది. 


బ్యాంకు నిఫ్టీ 30500 వద్ద మద్దతు తీసుకుంటున్నందున లోరిస్కుతో కూడిన ఐరన్‌ బటర్‌ఫ్లైస్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహం రేంజ్‌బౌండ్‌ మార్కెట్లలో మంచి ఫలితాలు ఇస్తుంది. వ్యూహంలో భాగంగా ఎట్‌ ద మనీ కాల్‌ కాల్‌ మరియు పుట్‌ను విక్రయించి, అవుట్‌ ఆఫ్‌ ద మనీ కాల్‌ మరియు పుట్‌ను కొనడం జరుగుతుంది. వీక్లీ ఆప్షన్స్‌కు సమయం చాలా తక్కువ కాబట్టి ఈ వ్యూహంలో ఫలితం వేగంగా వస్తుంది. మనం విక్రయించిన స్ట్రైక్‌ప్రైస్‌కు దగ్గరలో సూచీ ముగిస్తే గరిష్ట ప్రయోజనం ఉంటుంది. 



You may be interested

ఎలక్ట్రిక్‌ వాహనాలు..15 లక్షల ఉద్యోగాలకు ప్రమాదం

Monday 15th July 2019

ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం వలన ఇందన దిగుమతి ఖర్చులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాల వలన కాలుష్యాన్ని తగ్గించే విలుంటుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆటో రంగంలో ఈ సాంకేతిక మార్పు అనేక మందిపై ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావం చూపనుంది. లక్షలాది ఉద్యోగాలను కోల్పోవలసి ఉంటుంది.   ఎలక్ట్రిక్‌ వాహానాలకు మారడం వలన ఫ్యాక్టరీలలో ఇంజన్‌, ట్రాన్స్‌మిషన్‌ (పవర్‌ ట్రైన్‌) ఉద్యోగాలు   ప్రమాదంలో

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Monday 15th July 2019

అతి పెద్ద లోహా దిగుమతిదారైన చైనా జీడీపి వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో 27 ఏళ్ల కంటే తక్కువగా నమోదు కావడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ సూచీ సోమవారం ట్రేడింగ్‌లో 1.20 శాతం నష్టపోయి 2,792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో వేదాంత లి. 2.36 శాతం, టాటా స్టీల్‌ 1.59 శాతం, సెయిల్‌ 1.59 శాతం, మొయిల్‌ లి. 1.45 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 1.19 శాతం,

Most from this category