News


1.50శాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 11th February 2020
Markets_main1581401961.png-31687

మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,230.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 447 పాయింట్లు పెరిగి 31,505.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,058.15)తో పోలిస్తే 1.05శాతం లాభంతో 31,385.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ఆర్‌బీఎల్‌ 4శాతం, ఇండస్‌ ఇండ్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.50శాతం పెరిగింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1శాతం, కోటక్ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం లాభపడ్డాయి. యస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి నిఫ్టీ 106.40 పాయింట్ల లాభంతో 12,137.90 వద్ద, సెన్సెక్స్‌ 334 పాయింట్లు పెరిగి 41,313.89 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రెండు వారాలకు స్టాక్‌ రికమండేషన్స్‌

Tuesday 11th February 2020

జాబితాలో టాటా మోటార్స్‌, బయోకాన్‌ అరబిందో ఫార్మా, ఆల్కెమ్‌ లేబ్‌, టైటన్‌ రీసెర్చ్‌, బ్రోకింగ్‌ సంస్థల సిఫారసులు బడ్జెట్‌, కరోనా వైరస్‌ నేపథ్యంలో వెనకడుగు వేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరం‍దుకున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లు జంప్‌చేయడం ద్వారా తిరిగి 41,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ పరిస్థితుల్లో రానున్న రెండు వారాలలో రిటర్నులు అందించగల కొన్ని స్టాక్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌ తదితర రీసెర్చ్‌, బ్రోకింగ్‌ సంస్థల నిపుణులు సిఫారసు

ఆరు ఎంఎన్‌సీ షేర్ల రికమండేషన్లు

Tuesday 11th February 2020

బడ్జెట్లో డిడిటీ(డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌) ఎత్తివేయడం మల్టీనేషనల్‌ కంపెనీలకు మేలు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు, ఈ ఏడాది డీడీటీ తొలగింపుతో ఎంఎన్‌సీ కంపెనీలకు అత్యంత ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో బడ్జెట్‌ అనంతరం ఎంఎన్‌సీ కంపెనీల షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. బడ్జెట్‌ అనంతర వారంలో నిఫ్టీ ఎంఎన్‌సీ సూచీ దాదాపు 4 శాతం లాభపడింది. ఇకపై కూడా వీటి జోరు కొనసాగుతుందని,

Most from this category