News


బ్యాంకు నిఫ్టీ అరశాతం డౌన్‌

Friday 28th June 2019
Markets_main1561707156.png-26652

ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం అరశాతానికి నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,281.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు పతనంతో 0.70శాతం నష్టపోయి(200 పాయింట్లు) నష్టపోయి 31,281.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(31060.60)తో పోలిస్తే దాదాపు 1శాతం(200 పాయింట్లు) నష్టపోయి 31,281.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(31060.60)తో పోలిస్తే 0.40శాతం(126 పాయిం‍ట్లు) నష్టపోయి 31,142.90    వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి యస్‌ బ్యాంక్‌ 3శాతం, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌ 2శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు 1శాతం క్షీణించాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు పీఎన్‌బీ 4శాతం లాభపడింది. బ్యాంకు ఆఫ్‌ బరోడా 2శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు 1శాతం, ఎస్‌బీఐ బ్యాంకు అరశాతం, యాక్సిస్‌ బ్యాంకు 0.25శాతం లాభపడ్డాయి. 
సెన్సెక్స్‌ 131 పాయింట్లు నష్టపోయి 39,455.37 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, నిఫ్టీ 36 పాయింట్లను కోల్పోయి 11,805.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ప్రభుత్వ బ్యాంకులకు హోల్డింగ్‌ కంపెనీ

Friday 28th June 2019

ఏటా బడ్జెట్లో దీనికి నిధుల కేటాయింపు క్రమంగా ఈ వాటాలు ప్రైవేటు చేతికి! 2014 నాటి సిఫారసులపై మళ్లీ అధ్యయనం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఒక హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయాలన్న గత ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరమీదికి తెచ్చింది. బ్యాంకులకు అవసరమైన నిధుల సమీకరణకు ఈ ప్రణాళిక అనువైనదిగా భావిస్తోంది. వెటరన్‌ బ్యాంకర్‌ పీజే నాయక్‌ ఆధ్వర్యంలోని కమిటీ 2014లో చేసిన సిఫారసులకు అనుగుణంగా ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని ఆర్థిక

పీఎస్‌యూ బ్యాంకు షేర్ల జోరు

Friday 28th June 2019

2.50శాతం ర్యాలీ చేసిన ​పీఎస్‌యూబ్యాంక్‌ ఇండెక్స్‌  కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.40 వేల కోట్ల అదనపు నిధులను కేటాయించవచ్చనే అంచనాలతో శుక్రవారం ఈ రంగానికి చెందిన షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 31,281.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ 2.50శాతం

Most from this category