News


బ్యాంకింగ్‌ షేర్లలో రికవరీ

Monday 9th December 2019
Markets_main1575873691.png-30128

సోమవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన బ్యాంకింగ్‌ రంగ షేర్లకు నెమ్మదిగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభాల్లోకి మళ్లింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 31,341.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 0.70శాతం(119 పాయింట్లు) నష్టపోయి 31122.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ తిరిగి లాభాల్లోకి మళ్లింది. ఇంట్రాడే కనిష్టం 31122.05 నుంచి 363 పాయింట్లు(1.16శాతం) పెరిగి 31485.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు (31,341.55)తో పోలిస్తే 76 పాయింట్లు లాభంతో 31,402.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా 4.40శాతం పెరిగింది. పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.50శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం ర్యాలీ చేశాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం నష్టపోయింది. కోటక్‌ బ్యాంక్‌ పావుశాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 0.10శాతం నష్టపోయాయి. 



You may be interested

11950 దిగువన షార్ట్‌ చేయొచ్చు!

Monday 9th December 2019

నిఫ్టీపై నిపుణుల సలహా నిఫ్టీ స్వల్పకాలానికి డౌన్‌ట్రెండ్‌లోనే ఉండొచ్చని, ఈ సమయంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 11950 పాయింట్ల దిగువన కదలాడుతుంటే స్వల్పకాలానికి షార్ట్‌ చేయొచ్చని సూచిస్తున్నారు.  = చార్ట్‌వ్యూఇండియా నిపుణుడు మజార్‌ మహ్మద్‌ నిఫ్టీ తన స్వల్పకాలిక ఊర్ధ్వముఖ ఛానెల్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ సాధించింది. అందువల్ల స్వల్పకాలానికి ట్రెండ్‌ డౌన్‌గానే ఉంటుంది. గతంలో మద్దతునిచ్చిన 13రోజుల డీఎంఏ దిగువన ముగియడం మరింత బలహీనత చూపుతుంది. అప్‌సైడ్‌ ప్రస్తుతానికి పరిమితంగా

నవంబర్‌లో పెరిగిన ఉత్పత్తి : మారుతి షేరు జోరు

Monday 9th December 2019

నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెరగడంతో దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఈ నవంబర్‌ లో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం అధికం. ఇదే నవంబర్‌లో మొత్తం మొత్తం 1.39లక్షల ప్యాసింజర్‌ వాహనాలు ఉత్పత్తి జరిగిందని, గతేడాది

Most from this category