STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 6.50శాతం ర్యాలీ

Friday 20th September 2019
Markets_main1568960985.png-28452

కేంద్రం దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటనతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ చరిత్రలో ఒకరోజులో అతిపెద్ద లాభాల్ని చవిచూసింది. నేడు ఇండెక్స్‌ 26,878.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  దేశీయ కంపెనీలపై ప్రసుత్తం 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో అన్నిరంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రైవేట్‌రంగ బ్యాంక్‌లకు కలిసొస్తుందనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గచూపుతున్నారు. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ క్రితం ముగింపు(26,757.65)తో పోలిస్తే 6.57శాతం(1860 పాయింట్లు) పెరిగి 28517.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ 6.50శాతం(1,713.45 పాయింట్లు) లాభంతో  28,509.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌ 523.15 పాయింట్లు పెరిగి 11,228 వద్ద, సెన్సెక్స్‌ 1767 పాయింట్ల లాభంతో 37,860.41 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

ఐదేళ్ల కనిష్ఠానికి ‘జీ’

Friday 20th September 2019

సుభాష్‌ చంద్ర నాయకత్వంలోని ఎస్సెల్‌ గ్రూప్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి బీఎస్‌ఈలో ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. రుణాన్ని తిరిగి చెల్లించడానికి సుభాష్‌ చంద్ర ప్రైవేట్ సంస్థలకు మరికొంత సమయం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మ్యూచువల్ ఫండ్స్ తమలో తాము గొడవ పడుతుండటంతో ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ల రుణ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా శుక్రవారం ఉదయం 10.57 సమయానికి 9.65 శాతం నష్టపోయి

కేంద్రం అనూహ్య బొనంజా...కార్పొరేట్‌ పన్ను తగ్గింపు

Friday 20th September 2019

కేంద్రప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి (అన్ని రకాల సర్‌చార్జీ, సెస్‌ కలిపి) 25.17 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను శుక్రవారం ఆశ్చర్యపరిచింది. ఈ తాజా ట్యాక్స్‌ రేట్‌ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్‌ 1) నుంచి పరిగణిస్తారు. కాగా ఈ నిర్ణయం జీఎస్‌టీ సమావేశానికి ముందు వెలువడడం గమనార్హం. శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన అంశాలు.. -2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి

Most from this category