News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం పతనం

Monday 15th July 2019
Markets_main1563188401.png-27081

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. అయితే.., బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతానికి నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిధ్యం వహించే ఇండెక్స్‌ నేడు 30,688.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ వారంలో బ్యాంకింగ్‌ రంగంలోని యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ధన్ లక్ష్మి బ్యాంక్‌ లు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్న నేపథ‍్యంలో నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అలాగే మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 267 పాయింట్లు కోల్పోయి 0.85శాతం నష్టపోయి 30334.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా‍హ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,601.45)తో పోలిస్తే 112 పాయింట్లు(అర శాతం) క్షీణించి 30,439.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ అత్యధికంగా 5శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం, పీఎన్బీ బ్యాంక్‌ 2.50శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 2శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.50శాతం, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం నష్టపోయాయి. మరోవైపు కోటక్‌ బ్యాంక్‌ 1.50శాతం పెరగ్గా, యస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం పెరిగాయి. ఇదే సమయానికి నిఫ్టీ ఇండెక్స్‌ 21 పాయింట్లు పెరిగి 11,573.75 వద్ద, సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 38,830 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు పీఈ ప్లేయర్లు రెడీ!?

Tuesday 16th July 2019

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలితం దశకు చేరినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం ఆధారంగా తెలుస్తోంది. బ్యాంకుకు నూతన సీఈవో వచ్చిన తర్వాత ఆస్తుల నాణ్యతపై ఫోకస్‌ పెరగడం, ఫలితంగా ఏప్రిల్‌ త్రైమాసికంలో ఎన్‌పీఏలకు చేసిన అధిక కేటాయింపులతో భారీ నష్టాలను బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకు వృద్ధి బాట పట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంది. సీఈవో రవనీత్‌గిల్‌ ఇదే విషయమై

ఫలితాల ఎఫెక్ట్‌: ఇన్ఫోసిస్‌ కొత్త రికార్డు

Monday 15th July 2019

ఐటీ రంగ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు మించి నమోదు కావడం ఇందుకు కారణమైంది. గత శుక్రవారం మార్కెట్‌ ముగింపు అనంతరం కం‍పెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది.  1. ఏడాది ప్రతిపాదికన నికరలాభం 5.3శాతం పెరిగి రూ.3,802 కోట్లను ఆర్జించింది. అయితే, త్రైమాసికంగా చూస్తే నికరలాభం 6.8శాతం

Most from this category