News


బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం జంప్‌

Monday 24th June 2019
news_main1561359235.png-26527

పరిమిత మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,680.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో అనిశ్చితితో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ, ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం పెరిగి 30,783.65ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ షేర్లు 1శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. ఇదే ఇండెక్స్‌లో కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు 1శాతం నుంచి అరశాతం వరకు నష్టపోయాయి. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు 30,628.35తో పోలిస్తే పావుశాతం లాభంతో 30,692.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 8పాయింట్ల లాభంతో 39,202 వద్ద, నిఫ్టీ 1 పాయింట్‌ స్వల్ప నష్టంతో 11,723.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఏడాది కనిష్ఠాన్ని తాకిన 117 స్టాక్‌లు

Monday 24th June 2019

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలోని 117 స్టాక్‌లు సోమవారం ట్రేడింగ్‌లో తమ ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. ఎక్సేల్యా సొల్యుషన్స్‌ ఇండియా, ఆర్షియా, బన్నారి అమ్మన్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ స్టాక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఈమామి, ఈమామి పేపర్ మిల్స్‌, జీకేవీ, గ్లెన్‌మార్క్‌ పార్మా, ఐఎఫ్‌జీఎల్‌ రిఫ్రాక్సరిస్‌, జే భారత్‌ మారుతి, లుమెక్స్‌ ఇండస్ట్రీస్‌, సామ్‌ డిస్టిలరీస్‌ అండ్‌ బ్రేవరీస్, టీవీఎస్‌

విరాల్‌ నిష్క్రమణతో మరో 25బీపీఎస్‌ రేట్‌కట్‌?!

Monday 24th June 2019

నోమురా అంచనా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య రాజీనామా చేశారు. మరో ఆరునెలల కాలపరిమితి ఉండగానే ఆయన పదవి నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కేంద్రబ్యాంకులో రేట్ల తగ్గింపుపై నెలకొన్న వైరుధ్యాలే విరాల్‌ రాజీనామాకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. మానిటరీ పాలసీ, ఎకనమిక్‌అండ్‌ పాలసీ రిసెర్చ్‌ శాఖలకు విరాల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించేవారు. ప్రభుత్వానికి, ఆయనకు ఆర్‌బీఐ స్వతంత్రత విషయంలో విబేధాలు ఉన్నాయి.

Most from this category