News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం జంప్‌

Monday 9th September 2019
Markets_main1568014102.png-28268

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ  ఇండెక్స్‌ నేడు 27,240.35 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో ఇండెక్స్‌ 1.10శాతం పెరిగి 27539.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతవారం ముగింపు(27,247.90)తో పోలిస్తే 0.95శాతం లాభంతో 27,511.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 6శాతం పెరిగింది. ఫెడరల్‌ బ్యాంక్‌ 3.50శాతం, యస్‌బ్యాంక్‌ 2.50శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2శాతం, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.50శాతం పెరిగాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. 



You may be interested

షార్ట్‌టర్మ్‌కు టాప్‌టెన్‌ సిఫార్సులు

Monday 9th September 2019

వచ్చే రెండు మూడు వారాల్లో మంచి రాబడినందించే పది స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. వైశాలీ పరేఖ్‌ రికమండేషన్లు 1. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1550. స్టాప్‌లాస్‌ రూ. 1380. షేరు రూ. 1400 వద్ద బాటమ్‌ అవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌ ఇండికేటర్లలో ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతాలున్నాయి.  2. బజాజ్‌ ఆటో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3100. స్టాప్‌లాస్‌ రూ. 2720. కొన్ని రోజులుగా రూ. 2780 స్థాయిల్లో

వడ్డీరేట్ల కోత అంచనాలతో పెరిగిన పసిడి

Monday 9th September 2019

వడ్డీరేట్ల కోత అంచనాలు పెరగడంతో సోమవారం పసిడి ధర లాభాల బాట పట్టింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు పెరిగి 1,520 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఎగుమతుల తిరోగమనం కారణంగా ఆగస్టులో చైనా ఎగుమతులు పడిపోయాయి. యూరోజోన్‌ బ్రిగ్జిట్‌ సంక్షోభం కొనసాగుతుండటం, అమెరికాలో ఉద్యోగ వృద్ధి ఆగస్టులో ఊహించిన దానికంటే మందగించింది. చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కరించడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చని వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు

Most from this category