News


32వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 9th January 2020
news_main1578557858.png-30800

  • 799 పాయింట్లు లాభపడ్డ ఇండెక్స్‌

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న భారీ కొనుగోళ్ల మద్దతు కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం తిరిగి 32వేల స్థాయిని అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ బుధవారం క్లోజింగ్‌ 31373 పాయింట్ల నుంచి దాదాపు 400 పాయింట్ల లాభంతో 31748 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటికి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒకదశలో 2.59శాతం లాభపడి 32172.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(32172.70)తో పోలిస్తే 760 పాయింట్లు పెరిగి 32,159.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో యస్‌బ్యాంక్‌ అత్యధికంగా 5శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం పెరిగాయి. ఆర్‌బీఎల్‌, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ షేర్లు 3శాతం లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌ 1.50శాతం నుంచి అరశాతం పెరిగాయి. 



You may be interested

బీజీఆర్‌, అదానీ, యాస్టర్‌.. జోరు

Thursday 9th January 2020

బీజీఆర్‌ ఎనర్జీ అదానీ గ్రీన్‌ ఎనర్జీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 570 పాయింట్లు జంప్‌చేసి 41,387కు చేరగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 12,195 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వార్తల ఆధారంగా మూడు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బీజీఆర్‌ ఎనర్జీ ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ విభాగం

షుగర్‌, పీఎస్‌యూ సైక్లికల్స్‌ ఆకర్షణీయం!

Thursday 9th January 2020

కొటక్‌ పీఎంఎస్‌, సీఐవో అన్షుల్‌ సైగల్‌ ఇరాన్‌, అమెరికా మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి అవకాశాలను ధరలో ప్రతిబింబించని కంపెనీలవైపు దృష్టి సారించనున్నట్లు కొటక్‌ పీఎంఎస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ సైగల్‌ చెబుతున్నారు. ఇంకా మార్కెట్ల తీరు, మిడ్‌ క్యాప్స్‌లో పెట్టుబడులు తదితర అంశాలపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం... గతంలో అంటే 2003-05 మధ్య ఇరాక్‌

Most from this category