STOCKS

News


లాభాల్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు: అరశాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 5th February 2020
news_main1580883018.png-31525

మార్కెట్లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం(287 పాయింట్లు) పెరిగింది.  మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపారు. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 0.84శాతం(287 పాయింట్లు) పాయింట్ల పెరిగి 30,945.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు (30,686.70)తో పోలిస్తే 0.60శాతం లాభంతో 30,849.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన యస్‌బ్యాంక్‌ 10శాతం పెరిగింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 2శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, 1.50శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు అరశాతం పెరిగాయి. కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

వర్థమాన మార్కెట్లలో భారత్‌ భేష్‌

Wednesday 5th February 2020

త్వరలోనే ఆర్థిక పురోభివృద్ధి! మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలు వర్ధమాన మార్కెట్లలోకెల్లా భారత్‌ మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా పేర్కొంది. గత కొంతకాలంగా కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ మందగమన సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌ త్వరలోనే వృద్ధి బాట పట్టగలదని అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లకు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు జోనాథన్‌ గార్నర్‌ తెలియజేశారు. మోర్గాన్‌ స్టాన్లీలో ఏషియా, ఎమర్జింగ్‌

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 5th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనీల్‌ అంబానీ కుమారులు జై అనమోల్‌ అంబానీ, జై అన్షల్‌ అంబానీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డుకు నియమితులైన ఆరునెలల్లోనే రాజీనామా చేశారు. ఐఓసీ:  ఇజ్రాయిల్‌కు చెందిన బ్యాటరీ డెవలపర్‌ ఫినర్జీలో ఐఓసీ చిన్నమొత్తం వాటాను కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది సన్‌ఫార్మా: పెద్ద పరిమాణంలో ఇబ్బంది పెట్టె మొటిమలను నివారించేందుకు ఆబ్సొరికా ఎల్‌డీ క్యాప్య్సూల్‌లను

Most from this category