STOCKS

News


2వారాల కనిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Thursday 22nd August 2019
Markets_main1566455721.png-27944

ప్రైవేట్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2వారాల కనిష్టానికి పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో కీలమైన ఈ ఇండెక్స్‌ నేడు 27,690.05 వద్ద ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌ 7.50శాతం నష్టపోవడంతో పాటు, అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ, కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1.5శాతం నుంచి 1శాతం క్షీణించడంతో నేటి ఉదయం ట్రేడింగ్‌లో 27385.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ నెల 06 తరువాత ఈ స్థాయి దిగువకు చేరుకోవడం ఇదే తొలిసారి. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,385.20)తో పోలిస్తే 0.95శాతం నష్టంతో 27,455.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌ అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 7శాతం నష్టపోయింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.50శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.25శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు పావుశాతం పతనమయ్యాయి. అయితే యాక్సిస్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ పావుశాతం లాభపడింది. You may be interested

రియల్టీ సంక్షోభం..సంపన్నుల రుణ చెల్లింపులపై అనుమానాలు!

Thursday 22nd August 2019

గత ఏడాది ప్రారంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం రుణ మార్కెట్‌లో ఉన్న పెద్ద వ్యాపారవేత్తలను కూడా విడిచి పెట్టడంలేదు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రియల్టీ మందగమనం వలన ఈ రంగంతో ముడిపడి ఉన్న అజయ్‌ పిరమల్‌, పల్లోంజి మిస్త్రీ,  మంగల్‌ ప్రభాత్‌ లోధా(బీజేపీ ముంబై యూనిట్‌ అధ్యక్షుడు) వంటి భారతీయ సంపన్న వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  వ్యాపార వాతావరణం అధ్వాన్నంగా తయారవ్వడంతో పాటు ఫండింగ్‌ ఖర్చులు పెరగడంతో, ఈ వ్యాపారవేత్తలకు చెందిన

కాంట్రాబెట్స్‌పై ఎఫ్‌పీఐల కన్ను!

Thursday 22nd August 2019

తొలి త్రైమాసికంలో ఎఫ్‌పీఐల కొనుగోళ్ల ధోరణి పరిశీలిస్తే ఎక్కువగా కాంట్రాబెట్స్‌పై(బాగా క్షీణించిన స్టాకులు) నమ్మకం ఉంచినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్యు1లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా టెలికం, ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో రంగాల షేర్లను ఎక్కువగా కొన్నాయి. ఈ రంగాల్లో కాంట్రా బెట్స్‌ భారీగా ఉన్న సంగతి తెలిసిందే.  అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే క్యు1లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల వివరాలు ఇలా ఉన్నాయి... - ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాల్లో ఎఫ్‌ఐఐలు వరుసగా 4.4, 2.5 శాతం మేర వాటా

Most from this category