News


బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్రాష్‌

Wednesday 24th July 2019
Markets_main1563957293.png-27280

స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనంలో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం మరో 1శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 29,085.45 వద్ద ప్రారంభమైంది. నేటి ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనంతో 257 పాయింట్లు నష్టపోయి(0.85శాతం) 29000 స్థాయిని కోల్పోయి 28,871.00 వద్దకు క్షీణించింది. తదుపరి కాస్త రివకరీని సాధించి మిడ్‌సెషన్‌ కల్లా తిరిగి 29000 స్థాయిని తిరిగి అందుకుంది. ఈ ఇండెక్స్‌కు ఇది వరుసగా 5రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. మధ్యా‍హ్నం గం.1:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(29,128.10)తో పోలిస్తే 110.65 నష్టంతో 29,017.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండస్‌ ఇండ్‌ 3.50శాతం క్షీణించింది. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 3శాతం, యాక్సిస్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 2శాతం పతనమైంది. అలాగే యస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం వరకు క్షీణించాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పీఎన్‌బీ బ్యాంకు షేర్లు 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

అన్ని కంపెనీలకు 25%కార్పొరేట్‌ టాక్స్‌ వర్తింపు!

Wednesday 24th July 2019

సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించిన 25 శాతం కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపును అన్ని కంపెనీలకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలిచ్చారు. ఈ నెల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పలు కంపెనీలకు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు వరాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి కొన్ని బడా కంపెనీలను మాత్రం మినహాయించారు. కంపెనీల్లో దాదాపు 99.3 శాతాన్ని 25 శాతం రేటు పరిధిలోకి తెచ్చామని ఆమె రాజ్యసభలో

ప్రస్తుతం వేచి చూసే ధోరణే మంచిది: ఎంజెల్‌ బ్రోకింగ్‌

Wednesday 24th July 2019

మిడ్‌క్యాప్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌ను పరిశీలించవచ్చు: మయూరేష్ జోషి ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో మీడియా, ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో రంగంలోని షేర్లపై వేచి చూసే ధోరణిని అనుసరించడం మంచిదని ఎంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్ జోషి ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... వీటి కోసం వేచి చూడడం మంచిది.. మీడియా రంగంలో జీ ఒప్పందం మార్కెట్లకు ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ కారణంగా ఆదాయాల వృద్ధి

Most from this category