News


గరిష్టస్థాయి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 2.5 శాతం పతనం

Tuesday 24th September 2019
news_main1569309208.png-28516

ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం మేర క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 30,432.00 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ఆరంభంలో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 102 పాయింట్లు పెరిగి 30,668.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతర జరిగిన లాభాల స్వీకరణతో ఇంట్రాడే గరిష్టం(30,668) నుంచి 2.50శాతం క్షీణించి 29,889.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమైంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,432.00)తో పోలిస్తే 1.50శాతం నష్టం‍తో 30,103.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ అరశాతం నష్టపోయింది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని యస్‌ బ్యాంక్‌ 1శాతం, ఇండస్‌ బ్యాంక్‌ అరశాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం క్షీణించాయి. 



You may be interested

నష్టాల మార్కెట్లో... ఐటీ షేర్ల ర్యాలీ

Tuesday 24th September 2019

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లలో భారీ పతనాన్ని చవిచూసిన ఐటీ షేర్లు మంగళవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 2.50శాతం పెరిగింది. ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగి ఇన్ఫోసిస్‌ షేర్ల 3.50శాతం పెరగడం ఇండెక్స్‌ ర్యాలీకి తోడ్పడింది.గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిడెట్‌ శాచ్స్‌ సంస్థ ఇన్ఫోసిస్‌

2వారాల గరిష్టానికి పసిడి

Tuesday 24th September 2019

ఆర్థిక మందగమన భయాలు, మధ్య పశ్చిమాసియా ఉద్రికత్తలతో క్రితం సెషన్‌లో 2వారాల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర మంగళవారం ట్రేడింగ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,530 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే అమెరికా చైనాల మధ్య సానుకూల చర్చలు పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతున్నాయి.‘‘ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఇరు దేశాలు (చైనా, యునైటెడ్ స్టేట్స్)

Most from this category