News


బ్యాంక్‌ నిఫ్టీ క్రాష్‌

Monday 10th February 2020
Markets_main1581316049.png-31655

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 244 పాయింట్లు(0.75శాతం) నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,248.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 0.75శాతం నష్టాన్ని చవిచూసి 30,957.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,957.20)తో పోలిస్తే 170పాయింట్లు నష్టపోయి 31,032.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌, పీఎన్‌బీ షేర్లు 2శాతం నష్టాన్ని చవిచూశాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1.50శాతం పతనాన్ని చవిచూశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం నష్టపోగా, ఎస్‌బీఐ, కోటక్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.10శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 211 పాయింట్ల నష్టపోయి 40,930.36 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లను కొల్పోయి 12,022.80 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ సైతం అరశాతం నష్టాన్ని చవిచూశాయి. 



You may be interested

ఐటీసీ, ఐషర్‌ కౌంటర్లలో పెరిగిన షార్ట్స్‌

Monday 10th February 2020

షేరు ధరలో పతనం నమోదయి, ఓఐ పెరిగిన షేరు కౌంటర్లో షార్ట్స్‌ పెరిగినట్లు, ధరతో పాటు ఓఐ పెరిగితే లాంగ్స్‌ పెరిగినట్లు నిపుణులు విశ్లేషిస్తారు. ఫిబ్రవరి డెరివేటివ్స్‌ సీరిస్‌లో ట్రేడర్ల యాక్టివిటీ పెరిగిన ఐదు షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి.  1. ఐటీసీ: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 10 శాతం. ధరలో మార్పు: - 10.5 శాతం. బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించడం షేరుపై పెను నెగిటివ్‌ ప్రభావం చూపింది.

52 వారాల గరిష్టానికి 59 షేర్లు

Monday 10th February 2020

సోమవారం 52 వారాల గరిష్టానికి 59 షేర్లు పెరిగాయి. వీటిలో అబోట్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఏఐఏ ఇంజనీరింగ్‌, అలకెమ్‌ ల్యాబొరేటరీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో పైప్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారత్‌ రసయాన్‌, బిర్లా టైర్స్‌, సెరబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్టిబ్యూషన్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, ఎసాబ్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఎస్టర్‌ ఇండస్ట్రీస్‌, ఎఫ్‌డీసీ, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌

Most from this category