News


బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌

Thursday 3rd October 2019
Markets_main1570089483.png-28697

బ్యాంకు రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం(430 పాయింట్లు) నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 28,606.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయి 28,296.50 కనిష్టానికి పతమైంది. ఇండెక్స్‌లో అత్యదిక వెయిటేజీ కలిగిన ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్లైన కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం వరకు నష్టపోవడం ఇండెక్స్‌ భారీ క్షీణతకు కారణమైంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లైన ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్ల పతనం కూడా ఇండెక్స్‌ పతనానికి తమ వంతు సహకారాన్ని అందించాయి. మధ్యాహ్నం గం.1:10ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(28,725.50)తో పోలిస్తే 0.80శాతం నష్టంతో 28,495.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇక ఇదే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 180 పాయింట్లు నష్టపోయి 38,126 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల పతనమైన 11,317 వద్ద ‍ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. రియల్టీ, మీడియా, అటో, ఐటీ, ప్రభుత్వం రంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

పెరిగిన చెల్లింపుల కాలవ్యవధి..జీ షేరు 6% అప్‌

Thursday 3rd October 2019

రుణ చెల్లింపుల కాల వ్యవధిని రుణదాతలు ఇంకో ఆరు నెలలు పొడిగించారని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 9 శాతం లాభపడింది. ‘జీ లోని కొంత వాటాను విక్రయించేందుకు, జీ, రుణ దాతలు ఒక పరిష్కార మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు అదనంగా 10 శాతం వాటాను విక్రయించేందుకు ప్రతిపాదనలు జరిగాయి’ అని జీ ఎంటర్‌టైన్‌ సీఈఓ పునిత్‌ గొయెంక్‌

ఈక్విటీ, బంగారంపై బుల్లిష్‌: ఝున్‌ఝున్‌వాలా

Thursday 3rd October 2019

  ప్రస్తుతం ఇండియా ఈక్విటీ మార్కెట్లు చీకటి దశను ఎదుర్కొంటున్నాయని, కానీ మరి కొద్ది కాలంలో వెలుగొస్తుందని సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. ‘దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్నంతా అనిశ్చితిని ఇదివరకెప్పుడూ చూడలేదు. బహుశా ఇది మార్కెట్లకు ఉదయానికి ముందు వచ్చే చీకటి లాంటిది’ అని ఆయన అన్నారు. ‘మార్కెట్‌ పెరిగే ముందు, కోనుగోలు చేసుకోడానికి మనకొక అవకాశం ఇస్తుంది. ఇది వాతావరణం లాంటిది. మనకు నచ్చకపోయిన

Most from this category