News


బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం పతనం

Friday 19th July 2019
Markets_main1563526604.png-27183

మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 30515 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో జరిగిన స్వల్ప కొనుగోళ్ల కారణంగా ఇండెక్స్‌ 150 పాయింట్లు పెరిగి 30,543.75 వద్ద ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకింది. అనంతరం మార్కెట్లో జరిగిన అమ్మకాల సునామిలో భాగంగా ఇండెక్స్‌ 2శాతం(632 పాయింట్లు) క్షీణించి 30000 మార్కును కోల్పోయి 29,807.45 స్థాయిని పతనమైంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్‌ గతముగింపు(30,430.60)తో పోలిస్తే 593 పాయింట్ల నష్టంతో 29,837.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఆర్‌బీఎల్‌ 12శాతం క్షీణించింది. ఇండస్‌ఇండ్‌ 4.50శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 3.50శాతం క్షీణించాయి. కోటక్‌ బ్యాంక్‌ 2.50శాతం క్షీణించగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ 2శాతం నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనమయ్యాయి. అలాగే పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం క్షీణించాయి.

ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 500 పాయింట్లు నష్టపోయి 38,396 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 11,424 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

క్యు1లో ఎల్‌ఐసీ ఏం చేసింది?

Friday 19th July 2019

దేశీయ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ ఇండియా క్యు1లో తన ఈక్విటీ పోర్టుఫోలియోలో కొన్ని స్టాకుల్లో వాటాలు పెంచుకోవడం, కొన్నింటిలో తగ్గించుకోవడం చేసింది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఆగ్రోకెమికల్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాకుల్లో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకుంది. టెలికం, పవర్‌ మైనింగ్‌, పీఎస్‌బీ, ఎన్‌బీఎఫ్‌సీ, విద్యుదుత్పత్తి, చమురు అన్వేషణ రంగాల కంపెనీల్లో వాటాలు తగ్గించుకుంది. ప్రైవేట్‌ బ్యాంకులు ప్రస్తుతం ఎల్‌ఐసీ ఫేవరేట్లుగా ఉన్నాయి.  ఎల్‌ఐసీ వాటాలు పెంచుకున్న కంపెనీలు... ఎల్‌ఐసీ వాటాలు

కార్డు చెల్లింపుల్లో హైదరాబాద్ ద్వితీయ స్థానం

Friday 19th July 2019

రేజర్‌పే నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: డిజిటల్‌ యుగానికి అద్దం పడుతున్న నగరాల్లో బెంగళూరు టాప్‌ వన్‌ స్థానంలో నిలిచింది. పేమెంట్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ రేజర్‌పే నిర్వహించిన తాజా సర్వేలో ఈ నగరం మోస్ట్‌ డిజిటలైజ్డ్ సిటీల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది. ‘ఎరా ఆఫ్‌ రైజింగ్ ఫిన్‌టెక్’ పేరిట గురువారం విడుదలచేసిన సర్వేలో బెంగళూరు తరువాత వరుసగా హైదరాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర,

Most from this category