News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం క్రాష్‌..!

Tuesday 18th February 2020
Markets_main1582002875.png-31885

బ్యాంకింగ్‌ రంగ షేర్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,661.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను 'స్వల్పంగా చెల్లించినప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మొండి రుణాలపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు అటు ప్రభుత్వ బ్యాంక్‌, ఇటు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లను మార్కెట్ ప్రారంభించసాగారు. ఫలితంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లపై ఈ ఒత్తిడి ఎక్కువగా కొనసాగుతోంది. ఒక దశలో ఇండెక్స్‌ 1శాతం నష్టాన్ని చూసి 30396.35 వద్ద ఇంట్రాడే కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.10:30ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(30,680.70)తో పోలిస్తే 0.80శాతం నష్టంతో 30,435.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌బ్యాంక్‌ షేరు 6.50శాతం నష్టపోయింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4శాతం, ఆర్‌బీఎల్‌ 3శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 2.50శాతం పతనమయ్యాయి. పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోగా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అరశాతం నష్టాన్ని చవిచూశాయి. ఒక్క కోటక్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 0.05శాతం స్వల్పంగా లాభపడింది. 



You may be interested

ఎంఏసీడీ ప్రకారం ఈ షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 18th February 2020

సోమవారం ముగింపు ప్రకారం దేశీయ సూచీల్లో  24 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌; టొరెంట్‌ పవర్‌, బీజీఆర్‌ ఎనర్జీ, లుపిన్‌, మయూర్‌ యూనికోటర్స్‌, గ్రీవ్స్‌ కాటన్‌, ఏసియన్‌ హోటల్స్‌-వెస్ట్‌, నీల్‌కమల్‌, బ్లుడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, టీటీకే ప్రెస్టేజ్‌, శక్తి సుగర్స్‌, హుమ్‌టమకీ పీపీఎల్‌

ఆర్‌ఐఎల్‌ మీడియా కౌంటర్లకు విలీన జోష్‌

Tuesday 18th February 2020

14 శాతం దూసుకెళ్లిన టీవీ 18 బ్రాడ్‌క్యాస్ట్‌ 8 శాతం జంప్‌చేసిన డెన్‌ నెట్‌వర్క్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన హాథవే కేబుల్‌ ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా మీడియా, పంపిణీ కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రణాళికలు ప్రకటించడంతో గ్రూప్‌లోని పలు కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 20-8 శాతం మధ్య దూసుకెళ్లాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. షేర్ల జోరు ఉదయం 10 ప్రాంతంలో

Most from this category