News


గరిష్టం నుంచి 1శాతం పతనమైన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 24th October 2019
news_main1571897023.png-29106

  • గరిష్ట స్థాయి నుంచి 1శాతం పతనమైన ఇండెక్స్‌ 

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల్లోకి నుంచి నష్టాల్లోకి మళ్లింది. ఈ వారంలో ఇప్పటికి వరకు రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన బ్యాంకింగ్‌ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు ఈ ఇండెక్స్‌ కిత్రం ముగింపు(29459.60)తో పోలిస్తే అరశాతం లాభం(145 పాయింట్లు)తో 29604.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒకదశలో 29,693.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతరం మార్కెట్లో మొదలైన అమ్మకాల కారణంగా ఇండెక్స్‌ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి మళ్లింది. ఉదయం 11:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే 0.35శాతం(100 పాయింట్లు) నష్టపోయి 29,309.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌ 2.50శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.50శాతం, పీఎన్‌బీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో కోటక్‌బ్యాంక్‌ అరశాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.25శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు ప్రారంభించిన యుఎస్‌సెక్‌

Thursday 24th October 2019

   కంపెనీ లాభాలను, మార్జిన్‌లను ఎక్కువ చేసి చూపించారని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా యుఎస్‌ సెక్యురిటీ, ఎక్సేంజ్‌ బోర్డు(యుఎస్‌ సెక్‌)కు  ఆ కంపెనీ ఉద్యోగుల గ్రూప్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విజిల్‌ బ్లోవర్‌ ఫిర్యాదుపై దర్యాప్తును యుఎస్‌ సెక్‌ ప్రారంభించింది. ఇన్ఫోసిస్‌, యుఎస్‌ సెక్‌ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తుందని, వారికి అందుబాటులో ఉంటుందని కంపెనీ బీఎస్‌ఈకి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా పెద్ద ఒప్పందాలకు సంబంధించి కంపెనీ

ఇంధన రిటైలింగ్‌లో సంస్కరణలు ..నష్టాల్లో పెట్రో షేర్లు

Thursday 24th October 2019

దేశీయ ఇంధన రిటైలింగ్‌ రంగంలో చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో దేశీయ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు దేశీయ ఇంధన మార్కెట్‌లో కీలకంగా ఉన్న ప్రభుత్వ పెట్రో కంపెనీలకు ప్రై‍వేటు సంస్థల నుంచి పోటి ఏర్పడనుంది. ఈ అంశంతో పాటు యుఎస్‌ చమురు

Most from this category